హీరో యష్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్…!

Advertisement

2018 డిసెంబర్ 21 న విడుదలైన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’ తరువాత అన్ని భాషల్లోనూ హిట్టయిన చిత్రం ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో యష్ ను చూపించిన తీరుకి అంతా ఫిదా అయిపోయారు. హీరో యష్ కు కూడా ఇక్కడ క్రేజ్ ఏర్పడింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ అయితే ఇక్కడ మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ స్టార్ హీరోలనే టార్గెట్ చేసాడు.

ఇక ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని సౌత్ తో పాటు నార్త్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 23 న విడుదల కాబోతుంది అని ఆనౌన్స్ చేసారు. టీజర్ లు వంటివి కూడా ఉండవు.. డైరెక్ట్ ట్రైలర్ విడుదల చేస్తామని కూడా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది కాబట్టి ఆ డేట్ కి విడుదల కాకపోవచ్చు.

ఇదిలా ఉంటే.. ఈ లాక్ డౌన్ కారణంగా గ్యాప్ దొరికింది కాబట్టి.. హీరో యష్ ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య రాధికా పండిట్ అలాగే పిల్లలను ముద్దులతో ముంచెత్తుతున్నాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్యూటీ ఫుల్ ఫ్యామిలీ… లవ్లీ అంటూ కొందరు కామెంట్లు పెట్టి యష్ పైన ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus