మణిరత్నం సినిమా నుంచి తప్పుకొంటున్నారు

  • February 8, 2018 / 06:42 AM IST

కెరీర్ ఫినిష్ అయ్యేలోపు ఒక్కసారైనా మణిరత్నం సినిమాలో ఒకే ఒక్క ఫ్రేమ్ లోనైనా కనిపించి కనుమరుగైపోయినా పర్వాలేదనుకొనేవారు స్టార్ హీరోహీరోయిన్లు. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మణిరత్నం పిలిచి అవకాశం ఇచ్చినా సైలెంట్ గా సైడైపోతున్నారు యువ హీరోహీరోయిన్లు. “చెలియా” ఫ్లాప్ అనంతరం కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని మరీ తేరుకొని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఒక సినిమాని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకొన్నాడు మణిరత్నం. ఒక్క తెలుగు నుంచి తప్ప అన్నీ భాషల కథానాయకులను ఎంపిక చేసుకొన్నాడు.

కట్ చేస్తే.. తమిళ కథానాయకుడు శింబు మొదలుకొని మలయాళ కథానాయకుడు ఫహాద్ ఫజిల్ వరకూ సినిమా నుంచి వాకౌట్ చేయడానికి చూస్తున్నారట. విశ్వసనీయ చెన్నై వర్గాల సమాచారం ప్రకారం. శింబు ఇప్పటివరకూ డేట్స్ ఎలాట్ చేయలేదట. ఇక ఫహాద్ అయితే ఇచ్చిన డేట్స్ అన్నీ వేస్ట్ అవుతుండడంతోపాటు సినిమా ఎప్పుడు సెట్స్ కి వెళుతుంది అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో సినిమా నుంచి తప్పుకొందామనుకొంటున్నాడట. ఇక హీరోయిన్ల ఇబ్బందులైతే వర్ణించలేము. మణిరత్నం సినిమా కోసమని చాలా ప్రొజెక్ట్స్ వదిలేసుకొని వచ్చిన అదితిరావు వంటి అమ్మాయిలంతా తెగ టెన్షన్ పడిపోతున్నారట. మరి ఇంతమందిని ఇబ్బందికి గురి చేస్తూ మణిరత్నం ఏం సాదిద్ధాం అనుకొంటున్నారో తెలియదు కానీ.. ఇప్పటికే చాలా లేట్ అయిన ఈ బహుబాషా ప్రొజెక్ట్ ను అతి త్వరలోనే ప్రారంభిస్తే చాలా మంచిది. లేదంటే ఇంకొన్ని నెలలు ఆగితే టీం మొత్తానికి మణిరత్నం, సుహాసిని మాత్రమే మిగిలేలా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus