హీరో అంటే.. అందగాడు.. తెలివైనవాడు.. బలమైనవాడు అయి ఉండాలి. మానసికంగానూ దృఢంగా ఉండాలి. సమస్యలను ఎదుర్కుంటూ, సమస్యలను సృష్టించేవారికి బుద్ధిచెప్పగలగాలి. మరి ఏదైనా వైకల్యం ఉంటే… కిరాతమైనవాళ్లని ఎదిరించడం కష్టమవుతుంది… కానీ వివిధ వైకల్యంతో బాధపడుతున్నప్పటికీ మన సినిమాల్లో కొన్ని పాత్రలు హీరోగా నిరూపించుకున్నాయి. అటువంటి రోల్స్ పై ఫోకస్…
వాలి (అజిత్) తమిళ స్టార్ హీరో వాలి సినిమాలో మూగ, చెవిటి వాడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో అజిత్ జీవించారు.
అపరిచితుడు(విక్రమ్)కమర్షియల్ డైరక్టర్ శంకర్ తెరకెక్కించిన అపరిచితుడు సినిమాలో హీరో మల్టీపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే సమస్యతో బాధపడుతున్నారు. ఈ పాత్రలో విక్రమ్ అదరగొట్టారు.
శీను (వెంకటేష్)శీను సినిమాలో వెంకటేష్ చక్కగా మాట్లాడుతారు. అయితే ప్రేమ కోసం మూగ వాడిగా తయారవుతారు.
శీను వాసంతి లక్ష్మి (ఆర్. పీ. పట్నాయక్)సింగర్ అయిన ఆర్. పీ. పట్నాయక్ శీను వాసంతి లక్ష్మి సినిమాలో అంధుడిగా నటించి కన్నీరు తెప్పించారు.
సూర్య Vs సూర్య (నిఖిల్)యువ హీరో నిఖిల్ సూర్య Vs సూర్య సినిమాలో వింత సమస్యతో బాధపడే రోల్ చేశారు. ఎండ తగిలితే ప్రాణాపాయం కలిగే అరుదైన వ్యాధి ఉన్న వ్యక్తిగా నటించారు. తన ప్రేమను గెలిపించుకున్నారు. హిట్ అందుకున్నారు.
1 – నేనొక్కడినే (మహేష్ బాబు)స్టార్ హీరో మహేష్ బాబు మానసిక వ్యాధిగ్రస్తుడిగా 1 – నేనొక్కడినే చిత్రంలో నటించారు. తాను తికమక పడే సమస్యతో బాధపడుతున్నప్పటికీ.. తనని మరింత కన్ఫ్యూజ్ చేసే వారి భరతం పడుతాడు. ఈ సినిమా విజయం సాధించక పోయినప్పటికీ మహేష్ నటనకి మంచి పేరు వచ్చింది.
ఇంద్రుడు (విశాల్)విశాల్ ఇంద్రుడు సినిమాలో నాక్రోలెప్సీ అనే సమస్యతో బాధపడే రోల్ చేశారు, హఠాత్తుగా నిద్రపోయే ఈ జబ్బు ఎలా ఉంటుందో?.. ఆ వ్యాధి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో.. ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారో.. విశాల్ చక్కగా నటించి చూపించారు.
భలే భలే మగాడివోయ్ (నాని)సామాన్యంగా మతిమరుపు కామన్. ఆ డోస్ ఎక్కువగా ఉంటే ఇబ్బందే. ఆ ఇబ్బందితో నవ్వులు పూయించారు మారుతీ. తొందరగా మరిచిపోయే ఆ క్యారెక్టర్ లో నాని అదరగొట్టారు.
నేను మీకు తెలుసా (మంచు మనోజ్)గతాన్ని మరిచిపోయే పాత్రను నేను మీకు తెలుసా? సినిమాలో మంచు మనోజ్ పోషించారు. తన ప్రత్యేకమైన నటనతో అందరికీ గుర్తుండి పోయారు.
ఐ (విక్రమ్)అద్భుత పాత్రలను మరింత అద్భుతంగా పోషించే విక్రమ్ ఐ సినిమాలో అసహ్యంగా ఉండే కురూపిగా కనిపించి ఆశ్చర్యపరిచారు.
ఊపిరి (నాగార్జున)టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఊపిరి సినిమాలో చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. కాళ్లు సచ్చుపడిపోయిన పాత్రను సైతం నాగ్ హీరోగా నిలబెట్టారు.
మహానుభావుడు (శర్వానంద్)అతిగా శుభ్రంగా ఉండడం.. వైద్య భాషలో ఓసీడీ అంటారు. ఆ పాత్రను మహానుభావుడు చిత్రంలో శర్వానంద్ ఫర్ఫెక్ట్ గా చేశారు.
జై లవ కుశ (ఎన్టీఆర్)నత్తి ఉన్నవారిని చూస్తే ఎగతాళి చేస్తుంటారు.. కానీ అటువంటి నత్తి ఉన్న వ్యక్తి ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో చూపించారు.
రాజా ది గ్రేట్ (రవి తేజ)ఏ పాత్రని అయినా హుషారుగా చేసే రవి తేజ.. అంధుడి పాత్రను సైతం హుషారుగా చేసి అభిమానులకు కిక్ ఇచ్చారు. రాజా ది గ్రేట్ లో గుడ్డివాడిగా భలే నటించారు.
అ! (కాజల్)హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ సైతం వైకల్యం ఉన్న పాత్రల్లో మెప్పించారు. రీసెంట్ గా వచ్చిన అ! సినిమాలో మల్టీపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ తో బాధపడుతున్న అమ్మాయిగా అమోఘమైన నటన ప్రదర్శించింది.
రంగస్థలం (రామ్ చరణ్)కొత్తగా వచ్చే హీరోలు సైతం చేయడానికి వెనుకడుగు వేసే చెవిటివాడి పాత్రను రంగస్థలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పోషించారు. తన నటనతో అభిమానులను మెప్పించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
ఇవి మాత్రమే కాకుండా రాజ్ తరుణ్ (అంధగాడు ), అల్లరి నరేష్ (నేను) పోషించిన పాత్రలు కూడా ఈ కేటగిరీల్లోకే వస్తాయి. మేము ఇంకా ఏ పాత్రనైనా మిస్ అయివుంటే.. కామెంట్ చేయండి.