వెండి తెరపై తారలుగా ఎదిగిన ఎంతోమంది చిన్న పాత్రల ద్వారా సినిమాల్లో ప్రవేశింఛి.. తన నటనను నిరూపించుకొని హీరోగా ఎదిగారు. మరికొందరు విలన్లగా కనిపించి, మెప్పించి స్టార్లుగా మారారు. ఒక సారి హీరో గా మారిన తర్వాత చిన్నపాత్రలు చేయడానికి వెనుకాడేవారు. ముఖ్యంగా ప్రతి కథా నాయికగా చేయాలంటే ఒప్పుకునేవారు కాదు. కాని ప్రస్తుతం ట్రెండ్ మారింది. హీరోగా సినిమాలు చేసిన వారు విలన్లగా చేయడానికి సై అంటున్నారు.
చెడ్డ రోబోశంకర్ మాయాజాలం. ఐశ్వర్య అందం. రజనీకాంత్ అద్భుత నటన వెరసి రోబో. ఇందులో రజనీకాంత్ వశీకర్, రోబోగా నటించారు. మంచిగా ఉండే రోబో ద్వితీయార్ధంలో విలన్ గా మారిపోతుంది. విలన్ వెర్షన్లో రజనీ నటనకు ప్రేక్షకులు దాసోహం పలికారు. విలన్, హీరోగా నటించింది రజనీ అయినా ప్రేక్షకులకు పాత్రలు మాత్రమే కనిపించాయంటే .. అదే సూపర్ స్టార్ ప్రతిభ. అక్కడ నుంచే విలన్ పాత్రపై కూడా నటులకు ఆసక్తి పెరిగిందని చెప్పాలి.
ఫ్యామిలీ హీరో
శుభ లగ్నం, ఆయనకిద్దరు వంటి చిత్రాల ద్వారా ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు .. ఆడవాళ్లు భయపడే రీతిలో లెజెండ్ సినిమాలో విలనిజం చూపించాడు. బాలకృష్ణకు ఎదురుగా నిలబడి జగపతి బాబు చెప్పిన డైలాగులు కేక పుట్టించాయి. హీరోగానే కాకుండా విలన్ గా కూడా హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
రానాలీడర్, నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుం సినిమాల్లో హీరోగా నటించిన దగ్గుబాటి రానా ప్రతి కథానాయకుడి పాత్రకు సై అన్నారు. బాహుబలిలో భల్లాలదేవుడిగా అదరగొట్టారు. బాహుబలి కంక్లూజన్లో భల్లాలదేవుడి అసలు క్రూరత్వం కనిపించనుంది. అలా విలనిజం ప్రదర్శించి మళ్లీ హీరోగా నిలదొక్కుకొగలను అనే నమ్మకం రానాలో ఉండడం అభినందించాల్సిన విషయం. రానా భావించినట్లే తను హీరో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.
ఆదిఒక విచిత్రం, వైశాలి, గుండెల్లో గోదావరి, మరికొన్ని తమిళ్ చిత్రాల్లో హీరోగా చేసిన ఆది పినిశెట్టి “సరైనోడు” చిత్రంతో విలన్ గా మారిపోయాడు. అల్లు అర్జున్ కి గట్టి పోటీ ఇచ్చాడు. ఈ మూవీ విజయంలో హీరోతో పాటు వైరం ధనుష్ గా ఆది చేసిన నటన కూడా తోడయ్యింది. స్టార్ హీరోలను విలన్లగా చూపించి విజయం అందుకోవడం దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఇది రెండోసారి. ఇదివరకు డైరక్టర్ తేజ హీరో గోపీచంద్ ను నిజం సినిమాతో విలన్ గా చూపించాడు. అతను హిట్ కొట్టలేక పోయాడు.
సూర్యవిభిన్నమైన నటుడు అనే విషయాన్ని “24” సినిమాతో సూర్య మరోసారి నిరూపించుకున్నాడు. ఈ మూవీలో కేవలం కుర్చీకే పరిమితమయ్యే విలన్ పాత్ర ఆత్రేయ. లుక్ నుంచి యాక్టింగ్ వరకు అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అయినా సరే సినిమా అంతా అయ్యాక.. ఆత్రేయది కుర్చీకే సెటిల్ అయ్యే పాత్ర అంటే నమ్మలేం. అంతగా ఆ రోల్ పండిచాడు సూర్య. రజనీ తర్వాత ఒకే సినిమాలో హీరోగా, విలన్ గా మెప్పించిన నటుడిగా సూర్య సినీ చరిత్రలో నిలిచాడు.
సుధీర్ బాబుటాలీవుడ్ లో హీరో అయినా బాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. బాఘీ చిత్రం కోసం విపరీతంగా కండలు పెంచి, మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుని చూపించాడు. తన నటనతో హింది వాళ్లను అభిమానులుగా చేసుకున్నాడు.
తారక రత్నరాజా చెయ్యి వేస్తె చిత్రంతో హీరో తారక్ రత్న విలన్ రూపం ఎత్తాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ విజయం సాధించక పోయినా.. తారక్ రత్నయాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి.
క్యారెక్టర్లో పవర్ ఉండాలే గాని ఏ పాత్రలోనైనా మెప్పించగలమని నేటి యువ హీరోలు నిరూపిస్తున్నారు.