మహేష్ హీరోయిన్ మారిందా..?

మురగదాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ పరిణితి చోప్రా దాదాపు ఖారారైయిందని, తనకు ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చ్హి మరీ టాలీవుడ్ కి తీసుకువస్తున్నారని భావిస్తున్న తరుణంలో ఓ ట్విస్ట్ వచ్చిపడింది. ఈ సినిమా హీరోయిన్ విషయంలో మరో ఆలోచనకు వచ్చారట.

నేటివ్ లాంగ్వేజ్ హీరోయిన్ అయితే బావుంటుందని ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రకుల్ ప్రీత్ ను సంప్రదించారని తెలిసింది. ప్రస్తుతం ఈ విషయంలో సీరియస్ గా చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబధించి తాజాగా రకుల్ పై ఓ ఫోటో షూట్ కూడా చేశారట. ఎప్పటినుండో రకుల్, మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఎదురుచూస్తుంది. ఒకవేళ రకుల్ కు గాని ఈ ఛాన్స్ దక్కితే ఆమెకు జాక్ పాట్ తగిలినట్లే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus