Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

నాని, సుజీత్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ (నాని సొంత నిర్మాణ సంస్థ) బ్యానర్ల మీద ఈ సినిమా రూపొందుతోంది. ముందుగా చెప్పిన ప్రకారమైతే ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ తెరకెక్కించాల్సి ఉంది. ఆ విషయం పక్కనపెడితే.. ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్‌ ఎంపిక విషయంలో చర్చలు ముగిశాయి అని సమాచారం. తొలుత బలంగా వార్తలు వినిపించిన నాయికను కాకుండా వేరొక నాయికను ఓకే చేశారు అని సమాచారం.

Nani, Sujeeth

సినిమా వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం కొత్త కాంబినేషన్‌ వైపే సుజీత్‌ అండ్‌ నాని మొగ్గుచూపుతున్నారని సమాచారం. దీంతో గతంలో వార్తలు వచ్చినట్లుగా జూలియట్‌గా కణ్మని నటించడం లేదట. ఆ పాత్ర కోసం రుక్మిణిని ఓకే చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో మీకు మూడు డౌట్స్‌ రావొచ్చు. ఒకటి జూలియట్‌ ఎవరు? రెండోది కణ్మణి ఎవరు? మూడోది ఈ రుక్మిని ఏంటి? అని. ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాకు రూమర్డ్‌ టైటిల్‌ ఏంటి అనేది తొలుత తెలియాలి.

ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ని త్వరలో ప్రారంభిస్తారట. యాక్షన్, ఎమోషన్స్‌తో పాటు నాని శైలి ఎంటర్‌టైన్మెంట్ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేసి సుజీత్‌ ఈ సినిమా కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. విదేశాల్లో ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు. ఎందుకంటే హీరో విదేశాల నుండి ఇండియా వస్తాడట. ఎందుకొచ్చాడు, ఎలా వచ్చాడు, వచ్చినోడు ఎలాంటోడు అనేదే సినిమా కథ అని చెబుతున్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే పేరు పరిశీలిస్తున్నారట. ఆ లెక్కన హీరోయిన్‌ జూలియెట్టే కదా. ఇక ఆ జూలియట్‌గా కనిపించేది హీరోయిన్‌ రుక్మిణి (రీసెంట్‌ సినిమా ‘రెట్రో’లో పేరు) అలియాస్‌ పూజా హెగ్డే. మిస్‌ అయిన కాంబినేషన్‌ కణ్మణి (‘ఓజీ’లో) ప్రియాంక అరుళ్‌ మోహన్‌. అన్నీ ఓకే అయితే నాని – పూజ కాంబినేషన్‌ మనం చూస్తాం.

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus