తొలి ప్రేమ వంటి ప్రేమ కథ చిత్రంతో హిట్ అందుకున్న వరుణ్ తేజ్ (Varun Tej’s)ఇప్పుడు ప్రయోగాత్మక కథను చేయడానికి సిద్ధమవుతున్నారు. యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించనున్నారు. అంతరిక్షంలో జరిగే ఈ స్టోరీకి జోరుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో వ్యోమగామి (రోదసి యాత్రికుడు) గా వరుణ్ తేజ్ కనిపించనున్నారు. జీరోగ్రావిటీలో తేలియాడేట్టుగా నటించేందుకు అతను ప్రతేకంగా ఖజకిస్థాన్ లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్టు టాక్.
అందులో ఒక హీరోయిన్ ని ఫిక్స్ చేశారు. చెలియా మూవీ ద్వారా మనసులు దోచుకున్న బాలీవుడ్ బ్యూటీ అదితిరావు హైదరీని సెలక్ట్ చేశారు. ఈమె కూడ త్వరలోనే జీరో గ్రావిటీ శిక్షణ కోసం ఖజకిస్థాన్ వెళ్లనుంది. మరో హీరోయిన్ కోసం చిత్ర బృందం వెతుకుతోంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పటికీ రొమాన్స్, రొమాంటిక్ సాంగ్స్ ఉండవని ముందుగానే డైరక్టర్ స్పష్టం చేశారు. అహంబ్రహ్మాస్మి అనే టైటిల్ ఫిక్స్ చేసిన ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు పనిచేయన్నారు. దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.