Anil Ravipudi, Balakrishna: ఆ సెంటిమెంట్ బాలయ్య ఫ్యాన్స్ ను భయపెడుతోందా?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా సెప్టెంబర్ నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే బాలయ్యకు జోడీగా మెహ్రీన్ పేరు వినిపిస్తున్నా ప్రియమణి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారని సమాచారం. అయితే హీరోయిన్ ఎంపిక బాలేదని బాలయ్య ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలయ్య ప్రియమణి కాంబినేషన్ లో చాలా సంవత్సరాల క్రితం మిత్రుడు అనే సినిమా తెరకెక్కింది.

విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత బాలయ్య ప్రియమణి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. బాలయ్యకు జోడీగా నటించడానికి హీరోయిన్లు సిద్ధంగానే ఉన్నా శ్రీలీలకు తల్లిగా నటించడం హీరోయిన్లకు సులువు కాదు. ఆ కారణం వల్లే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణి ఎంపికయ్యారని సమాచారం అందుతోంది.

ప్రియమణి నటనకు మంచి మార్కులే పడే ఛాన్స్ ఉన్నా కెరీర్ పరంగా సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న హీరోయిన్లలో ప్రియమణి కూడా ఒకరు కావడం గమనార్హం. అయితే బాలయ్య ప్రియమణి జోడీ బాగుంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రియమణి చేతిలో కూడా ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు లేవు. బాలయ్య తన శైలికి భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారని అయితే సినిమాలో బాలయ్య ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు మాత్రం ఉంటాయని సమాచారం అందుతోంది.

భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని బోగట్టా. ఎఫ్3 సినిమాతో సక్సెస్ సాధించి ఈ సినిమాను మొదలుపెట్టాలని అనిల్ రావిపూడి అనుకుంటున్నారు. ఎఫ్3 సినిమా హిట్టైతే ఎఫ్4 సినిమాను తెరకెక్కించాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారని బోగట్టా. అనిల్ రావిపూడి వేగంగా సినిమాలను తెరకెక్కిస్తూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus