Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

తెలుగులో అన్ని ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు ఎక్కడున్నాయి.. మనవాళ్లు పెద్దగా తీయడం లేదు కదా అనుకుంటున్నారా? అవును మీరు చెప్పింది నిజమే. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే సినిమాలు లిస్ట్‌ తమిళ సినిమా పరిశ్రమకు సంబంధించింది. ఆ సినిమాలు మన ప్రేక్షకుల ప్రేమ (?)ను కొల్లగొట్టడానికి తెలుగులో అనువాదం జరుపుకుని మరీ వస్తాయి కాబట్టి.. మనం కూడా ఓ లుక్కేస్తే సమాచారం ఉంటుందని చెబుతున్నాం.

Kollywood

కోలీవుడ్ ఎప్పటిలానే కొత్త రకం కథలతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో నాయికా ప్రాధాన్య చిత్రాలను కూడా చేస్తుంటారు. అలా ప్రస్తుతం తమిళ సినిమాలో మొత్తం నాలుగు వుమన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు రూపొందుతున్నాయి. ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘మంజనాతి’. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌ మోహన్ ప్రధాన పాత్రధారి. యువ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ‘PR Show’ పేరిట సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ఇటీవల ప్రారంభించారు.

ఈ సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి వస్తున్న మొదటి చిత్రంలో యంగ్ బ్యూటీ మమితా బైజు, స్వాసిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆరుగురు దర్శకులు కలసి రూపొందిస్తున్న ఈ సినిమా వైవిధ్యంగా ఉండబోతోంది అని ఇటీవల రిలీజ్‌ చేసిన ప్రమోషనల్‌ వీడియో చెప్పకనే చెప్పింది. అలాగే మరో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో ఓ సినిమా తెరకెక్కిస్తోంది. ఇందులోనూ ప్రియాంక మోహన్‌దే ముఖ్య పాత్రలో నటిస్తోంది.

సీనియర్‌ హీరోయిన్‌ త్రిష, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, వెర్సటైల్‌ యాక్టర్‌ అపర్ణా బాలమురళి ‘ఎయిర్‌లిఫ్ట్’ సినిమా ఫేమ్ రాజా కృష్ణ మీనన్ దర్శకత్వంలో ఓ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్‌ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. ఇవి కాకుండా మరికొన్ని తమిళ సినిమాలు, స్టార్‌ నటులు ఇలాంటి సినిమాలకు ఓకే చెబుతున్నారు. త్వరలోనే వీటి విషయంలో క్లారిటీ వస్తున్నాయి. ఈ సినిమాలన్నీ తెలుగులో కూడా వస్తాయి.

‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus