వైరల్ అవుతున్న స్టార్‌ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అభినయ ప్రధాన పాత్రలకే పరిమితమై విజయాలను సొంతం చేసుకున్న హీరోయిన్లలో స్నేహ (Sneha) ఒకరు. స్నేహ ఈ మధ్య కాలంలో తెలుగులో తక్కువ సినిమాలలోనే నటించినా మంచి పాత్రలలో మాత్రమే నటిస్తున్నారు. స్నేహ భర్త ప్రసన్న (Prasanna) గురించి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడని స్నేహ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హనుమాన్ జంక్షన్, వెంకీ (Venky) , సంక్రాంతి (Sankranthi) , శ్రీరామదాసు (Sri Ramadasu) , పాండురంగడు (Pandurangadu) సినిమాలు తెలుగులో ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2012 సంవత్సరంలో స్నేహ, ప్రసన్న వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. మ్యారేజ్ తర్వాత స్నేహకు హీరోయిన్ ఆఫర్లు తగ్గగా తెలుగులో చివరగా వినయ విధేయ రామలో స్నేహ నటించారు. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో స్నేహకు తెలుగులో కొత్త ఆఫర్లు రాలేదు.

స్నేహ కొంతకాలం క్రితం చీరల బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వగా ఈ బిజినెస్ లో కూడా ఆమె సక్సెస్ అయ్యారు. పెళ్లికి ముందే నా భర్త జీవితంలో ఒక అమ్మాయి ఉందని ఆ అమ్మాయితో బ్రేకప్ అయిందని స్నేహ కామెంట్లు చేశారు. అయితే పెళ్లికి ముందు ప్రసన్నకు బ్రేకప్ అయినా ఆ విషయంలో నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని స్నేహ వెల్లడించడం గమనార్హం. ప్రసన్న లైఫ్ లో బ్రేకప్ జరగడం వల్లే మా ఇద్దరి పెళ్లి జరిగిందని స్నేహ అన్నారు.

స్నేహను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా ఆమె పలు యాడ్స్ లో కూడా నటిస్తూ క్రేజ్ ను పెంచుకుంటూ ఉండటం గమనార్హం. స్నేహ వచ్చిన ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ స్నేహ వయస్సు 42 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో కూడా ఆమెకు క్రేజ్ తగ్గడం లేదు. స్నేహ తెలుగులో మరింత బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus