హీరోయిన్లు అంటే పాటలకు మాత్రమే అవసరం. పాటలకు ముందు వచ్చి అలా వచ్చి కనిపించేసి, అటెండెన్స్ వేయించుకున్నట్టు వెళ్ళిపోతే సరిపోతుంది అనే కమర్షియల్ ఫార్మేట్ సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇప్పుడు ఆగిపోయాయి అని చెప్పడం లేదు. చాలా వరకు హీరోయిన్లు అంటే స్కిన్ షో చేయాల్సిందే. లేదంటే ఒక వర్గం ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు చాలా కాలం నుండి నడుస్తుంది. ముందు ముందు కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్లు అందం మెయింటైన్ చేయడం కోసం ఖరీదైన ఇంజక్షన్ లు, సర్జరీ లు చేయించుకుంటారు అని ఈ మధ్యనే ఓ హీరోయిన్ చెప్పుకొచ్చింది.
అయితే స్కిన్ షో మీద ఆధారపడిన హీరోయిన్లు స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ, స్కిన్ షో చేసినంత మాత్రాన స్టార్ హీరోయిన్లు అయిపోయారు అనడం లేదా,అలా అనుకోవడం కూడా అతిశయోక్తి అవుతుంది. కేవలం స్కిన్ షోలు చేస్తే స్టార్లు అయిపోతారు అనుకుంటే ముంబై బ్యూటీ లు చాలా మంది స్కిన్ షోలకు రెడీగా ఉన్నారు.కానీ నటిగా ప్రూవ్ చేసుకుని, కథకి ప్రాధాన్యత కలిగిన పాత్రలు ఎంపిక చేసుకున్నప్పుడే కొంతమంది స్టార్లు ఎదిగారు.మరికొంతమంది అయితే స్కిన్ షో పై ఆధార పడకుండా నటనతో స్టార్లు అయ్యారు. అలాంటి నటీమణులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) సుహాసిని:
తమిళ నటే అయినప్పటికీ ..అచ్చ తెలుగు అమ్మాయిగా పాపులర్ అయ్యింది. స్కిన్ షోకి చాలా దూరంగా ఉంటూ వచ్చిన సుహాసిని ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది అంటే ఆమె ఎంత గొప్ప నటో అర్ధం చేసుకోవచ్చు.ఆమె నటన ఎంత చక్కగా..నేచురల్ గా ఉంటుందో చాలా సార్లు చూశాం కదా.
2) శోభన :
కళ్ళతోనే మాయ చేయగలి నటి. ఎటువంటి పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేసేస్తుంటుంది. స్కిన్ షో కి దూరంగా ఉండి స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న భామల్లో ఈమె కూడా ఒకరు.
3) జయసుధ :
ఈమె గ్లామర్ పాత్రలు చేయలేదు అని కాదు, గ్లామర్ షో చేయలేదు అని కాదు. అలాంటివి చేసినా ఈమెలో సహజత్వం బయటపెట్టిన తర్వాతే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
4) భానుప్రియ :
ఈమె కూడా జయసుధలానే. మొదట్లో గ్లామర్ షో చేసినా తర్వాత తన నటన పైనే ఆధారపడి స్టార్ హీరోయిన్ అయ్యింది.
5) రేవతి :
సుహాసిని గారి తర్వాత రేవతి గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈమెకు ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి జీవం పోస్తుంది అనడంలో సందేహం లేదు.
6) రాధిక :
మన రాధిక గారు కూడా అంతే. ఈమె చేయని పాత్రలు అంటూ లేవు. ఈమె నటన ప్రేక్షకులను కట్టిపారేస్తుంటుంది. స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి అదే కారణమైంది.
7) ఆమని :
ఈమె కూడా గ్లామర్ షో కి దూరంగానే ఉంటూ వచ్చింది. మిడ్ రేంజ్ హీరోల సరసన చేసిన సినిమాలతోనే ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది.
8) సౌందర్య :
ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకుని.. కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ కు కొత్త డెఫినిషన్ చెప్పింది.
9) స్నేహ :
టాలీవుడ్ కు మరో సౌందర్య అని ఈమె గురించి చెప్పుకునేవారు. కానీ సౌందర్యలా ఎక్కువ కాలం స్టార్ హీరోయిన్ గా రాణించలేదు.
10) నిత్యా మేనన్ :
నిత్యా మేనన్ కూడా తన మొదటి సినిమా నుండి స్కిన్ షో ని నమ్ముకోలేదు. తన టాలెంట్ తోనే గొప్ప నటిగా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
11) ఐశ్వర్య రాజేష్ :
కెరీర్ ప్రారంభంలో ఐశ్వర్య రాజేష్.. హీరోయిన్ గా పనికిరాదు అని విమర్శించిన బ్యాచ్ చాలా మంది ఉన్నారు. కానీ ఆమె బెస్ట్ పెర్ఫార్మర్ లిస్ట్ లో టాప్ పొజిషన్లోనే ఉంటుంది.
12) సాయి పల్లవి :
లేడీ పవర్ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న సాయి పల్లవి కూడా అద్భుతమైన నటి. ఇలాంటి హీరోయిన్ ఈ టైంలో కూడా ఉన్నందుకు అంతా గర్వపడాలి.
13) నజ్రియా ఫహాద్ :
ఈమె కూడా నటనకే ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఇప్పటికీ స్టార్ గా రాణిస్తుంది. ‘అంటే సుందరానికీ!’ చిత్రంతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి ఇక్కడి ప్రేక్షకులను అలరించింది.