ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ‘మిస్టర్ నూకయ్య’ వంటి డిఫరెంట్ మూవీని అందించిన దర్శకుడు అనిల్ కన్నెగంటి డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘హిడింబ’. ‘శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్’ (SVK సినిమాస్) బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరించారు. ‘హిడింబ’ ట్రైలర్ బాగుంది. సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేసింది. జూలై 20న రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది.
కానీ వర్షాల వల్ల.. సినిమా ఓపెనింగ్స్ పై దెబ్బ పడింది అని చెప్పాలి.కానీ స్టడీగా వీకెండ్ వరకు కలెక్ట్ చేసింది. మొదటి సోమవారం కూడా ఒకింత పర్వాలేదు అనిపించింది అనే చెప్పాలి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
0.69 cr
సీడెడ్
0.35 cr
ఉత్తరాంధ్ర
0.15 cr
ఈస్ట్
0.12 cr
వెస్ట్
0.08 cr
గుంటూరు
0.09 cr
కృష్ణా
0.09 cr
నెల్లూరు
0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
1.62 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
1.87 cr (షేర్)
‘హిడింబ’ (Hidimba) చిత్రానికి రూ.2.56 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి రూ.1.87 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కి రూ.1.13 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
ఓ పక్కన ‘బేబీ’ మరో పక్క వర్షాల ఎఫెక్ట్ వల్ల ‘హిడింబ’ ఎక్కువ ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయింది. కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తుంది. మరి బ్యాలెన్స్ టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో చూడాలి.