ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హిడింబ’. ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు ఈ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయని చెప్పాలి. రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలను ఓ వ్యక్తి చంపుతూ ఉంటాడు. అతను ఎవరు? ఎందుకు చంపుతాడు? అని తెలుసుకుంటున్న ప్రాసెస్ లో హీరో టీంకి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి.
హీరోయిన్ నందిత శ్వేతా – అశ్విన్ ల మధ్య ఘాటైన లిప్ లాక్ ఈ ట్రైలర్ కు హైలెట్ అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్ ‘ సమర్పణలో శ్రీధర్ గంగపట్నం, ఎస్వీకే సినిమాస్ నిర్మించాయి. ఇదిలా ఉండగా.. ‘హిడింబ’ సినిమా సెన్సార్ కష్టాలు ఫేస్ చేస్తున్నట్టు టాక్ నడిచింది. దాని పై నిర్మాత అనిల్ సుంకర క్లారిటీ ఇచ్చారు. ‘హిడింబ’ సినిమా సెన్సార్ కార్యక్రమాల్లో భాగంగా రివిజన్ కమిటీ వద్దకు వెళ్లినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో (Hidimba) వయొలెన్స్ ఎక్కువగా ఉండటం కూడా దీనికి కారణం అని ఆయన డైరెక్ట్ గానే చెప్పారు. అయితే సినిమా బాగా వచ్చిందని. ట్రైలర్ తోనే తమకి టేబుల్ ప్రాఫిట్స్ వచ్చాయని అనిల్ సుంకర తెలిపారు. జూలై 14 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నట్టు ఈ సందర్భంగా అనిల్ సుంకర చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.