Sudigali Sudheer: ఆశలన్నీ ఆ సినిమా పైనే పెట్టుకున్న సుధీర్?

బుల్లితెర మెగాస్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ గురించి పరిచయం అవసరం లేదు. ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.జబర్దస్త్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుధీర్ ఇతర కార్యక్రమాలలో కూడా అవకాశాలు అందుకున్నారు. అయితే ఈయనకున్న పాపులారిటీ చూసి ఏకంగా వెండి తెర అవకాశాలు కూడా రావడం విశేషం.

సుధీర్ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఇతనికి మొదటిసారిగా సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాలో హీరోగా నటించారు. అలాగే త్రీ మంకీస్ అనే సినిమాలో కూడా ఈయన హీరోగా నటించారు. సుధీర్ హీరోగా నటించిన ఈ రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయని చెప్పాలి. అయితే ఈ సమయంలో ఈయన ఒకవైపు జబర్దస్త్ లో నటిస్తూనే మరోవైపు సినిమాలు చేశారు. ప్రస్తుతం ఈయన సినిమా అవకాశాలు రావడంతో ఏకంగా జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసి సినిమాలలో నటిస్తున్నారు.

ఈ క్రమంలోనే కే రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో సుడిగాలి సుదీర్ హీరోగా ఇతర సీనియర్ నటీనటులు కలిసి నటించిన చిత్రం వాంటెడ్ పండుగాడు.ఈ సినిమా ఈనెల 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలయ్యి మంచి హిట్ అందుకుంటేనే సుదీర్ కు ఇతర సినిమా అవకాశాలు వస్తాయని చెప్పాలి.

ఈ సినిమా మంచి గుర్తింపు సంపాదించుకొని భారీ కలెక్షన్లను రాబడితేనే ఈయన ఓకే చెప్పిన తదుపరి రెండు ప్రాజెక్టులు కూడా సెట్స్ పైకి వెళ్ళుతాయని లేదంటే అంతటితోనే ఆగిపోతాయని ముందుగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.ఇక సుధీర్ నటిస్తున్న సినిమాలు కూడా పెద్ద బ్యానర్స్ కాకపోవడంతో ఈ సినిమా క్లిక్ అయితేనే తన లైఫ్ మరో రేంజ్ కు వెళుతుంది లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది సుదీర్ టెన్షన్ మరింత పెరిగిపోతుందని చెప్పాలి. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో వేచి చూడాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus