టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలు ఇవే

అప్పటి రోజుల్లో ఓ చిత్రం హిట్టయ్యిందంటే ఎన్ని రోజులు ఆడింది అనేది రికార్డ్స్ గా చెప్పుకునే వారు. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు, 360 రోజులు ఇలా చెప్పుకునే వారు. టీవీలు లేని రోజులు కాబట్టి అప్పట్లో చిత్రాలు ఎక్కువ రోజులు ప్రదర్శితమయ్యేవి. కొంచెం ట్రెండ్ మారిన తరువాత ఎన్ని రోజులు… ఎన్ని సెంటర్స్ లో ఆడింది అనేది చర్చించుకోవడం మొదలు పెట్టేవారు. వి.సి.డి, డివిడి ల కాలం కాబట్టి సినిమాలు ఎక్కువ రోజులు ఆడకపోయినా… 50 రోజులు, 100 రోజులు వరకూ రికార్డ్స్ నిలబెట్టేవారు. కానీ ఇప్పటి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సినిమా తీసిన బడ్జెట్ ఎంత… గ్రాస్ కలెక్షన్స్ ఎంత…? ఆ చిత్రానికి షేర్ ఎంత… వీటిని ఆధారం చేసుకునే రికార్డ్స్ ను చెప్పుకుంటున్నారు. అలా ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన మన తెలుగు చిత్రాల్ని కొన్ని చూద్దాం రండి :

1) బాహుబలి 2 : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2 ది కన్ క్లూజన్’ చిత్రం దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 1707 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి 831 కోట్ల షేర్ ను వసూలు చేయడం విశేషం.

2)బాహుబలి : ప్రభాస్ – రాజమౌళి – రానా కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో రూపొంది 650 కోట్ల గ్రాస్ ను నమోదుచేసి… 302 కోట్ల షేర్ ను రాబట్టింది.

3)రంగస్థలం : రాంచరణ్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ క్రేజీ చిత్రం 60 కోట్లతో రూపొంది… 200 కోట్ల గ్రాస్ ను నమోదు చేసి… 120 కోట్ షేర్ ను రాబట్టి… నాన్ – బాహుబలి రికార్డు ని సొంతం చేసుకుంది. యూ.ఎస్ లో ఈ చిత్రం 3.5 మిలియన్ డాలర్లను వసూల్ చేయడం విశేషం.

4) ఖైదీ నెంబర్ 150 : దాదాపు దశాబ్దం తరువాత మెగాస్టార్ చిరంజీవి ఫుల్ లెంగ్త్ హీరోగా వచ్చిన ఈ చిత్రం… 65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 165 గ్రాస్ ను నమోదు చేసి… 105 కోట్ల షేర్ ను వసూల్ చేసి.. మెగా స్టార్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.

5)భరత్ అనే నేను : వరుస ప్లాపులతో సతమవుతున్న మహేష్ కి… కొరటాల శివ ‘భరత్ నేను’ చిత్రంతో రిలీఫ్ ఇచ్చాడు. దాదాపు 65 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం 157 కోట్ల గ్రాస్ ని నమోదు చేసి… 95 కోట్ల షేర్ ని వసూల్ చేసి.. ‘ఆల్ టైం టాప్ 5’ లో ప్లేస్ సంపాదించుకుంది. ఇక యూ.ఎస్. లో ఈ చిత్రం 3.4 మిలియన్ డాలర్లను వసూల్ చేయడం విశేషం.

6)అరవింద సమేత వీర రాఘవ : జూ.ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 70 కోట్ల బడ్జెట్ తో నిర్మితమయ్యి.. దాదాపు 145 కోట్ల గ్రాస్ ను నమోదుచేసి 91 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. అదే సంవత్సరం ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో డిజాస్టర్ ను చవి చూసిన దర్శకుడు త్రివిక్రమ్ కు ఈ చిత్రం పెద్ద రిలీఫ్ ను ఇచ్చింది.

7)శ్రీమంతుడు : ‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ వంటి వరుస డిజాస్టర్లతో డీలా పడిపోయిన మహేష్ కు… ‘శ్రీమంతుడు’ చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కొరటాల శివ. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మితమయిన ఈ చిత్రం 156 కోట్ల గ్రాస్ ను నమోదు చేసి… 85 కోట్ల షేర్ ను రాబట్టింది.

8)మగధీర : రాంచరణ్ – రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘ఇండస్ట్రీ హిట్’ అయిన ‘మగధీర’ చిత్రం 40 కోట్ల బడ్జెట్ తో నిర్మితమయ్యి … అప్పటి రోజుల్లోనే 151 కోట్ల గ్రాస్ నమోదుచేసి… 83 కోట్ల(అన్ని భాషలు కలిపి) షేర్ ని రాబట్టింది

9)ఎఫ్ 2 : విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఈ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం.. ఈ సంక్రాంతికి విడుదలయ్యింది. కేవలం 25 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం 140 కోట్ల గ్రాస్ ను నమోదు చేసి… 82 కోట్ల షేర్ ను రాబట్టి… బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

10) జనతా గ్యారేజ్ :కొరటాల శివ – జూ.ఎన్టీఆర్ – మోహన్ లాల్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 55 కోట్ల బడ్జెట్ తో నిర్మితమయ్యి… 135 కోట్ల గ్రాస్ ను నమోదు చేసి… 81 కోట్ల షేర్ ను రాబట్టింది.

11) జై లవ కుశ : జూ.ఎన్టీఆర్ త్రిపాత్రాబినయం కనపరిచిన ‘జై లవ కుశ’ చిత్రం… 60 కోట్ల బడ్జెట్ తో నిర్మితమయ్యి… 133 కోట్ల గ్రాస్ ని నమోదు చేసి… 77 కోట్ల షేర్ ను రాబట్టింది.

12)అత్తారింటికి దారేది :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం… 40 కోట్ల బడ్జెట్ తో నిర్మితమయ్యి … 136 కోట్ల గ్రాస్ ను నమోదు చేసి… 76.2(కేవలం తెలుగులో) షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

13)సరైనోడు : అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రం 50 కోట్ల బడ్జెట్ తో నిర్మితమయ్యి 129 కోట్ల గ్రాస్ ను నమోదు చేసి… 73 కోట్ల షేర్ ను రాబట్టింది.

14) దువ్వాడ జగన్నాధం (డీజె) :అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 50 కోట్ల బడ్జెట్ తో రూపొంది… 115 కోట్ల గ్రాస్ ని నమోదుచేసి… 72 కోట్ల షేర్ ని వసూల్ చేసింది.

15)గీత గోవిందం : గతేడాది వచ్చిన విజయ్ దేవరకొండ, రష్మిక ల ‘గీత గోవిందం’ చిత్రం… కేవలం 9 కోట్ల బడ్జెట్ తో రూపొంది… 130 కోట్ల గ్రాస్ ని నమోదు చేసి 69.7 కోట్ల షేర్ ను రాబట్టింది. యూ.ఎస్ లో ఈ చిత్రం 2.47 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది.

16)కాటమరాయుడు : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – డాలి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 55 కోట్ల బడ్జెట్ తో నిర్మితమయ్యి… 98 కోట్ల గ్రాస్ ని నమోదు చేసి… 61 కోట్ల షేర్ ని రాబట్టింది.

17)గబ్బర్ సింగ్ : వరుస ప్లాపులతో సతమవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ‘గబ్బర్ సింగ్’ రూపంలో పెద్ద బ్లాక్ బస్టర్ దొరికింది. 35 కోట్ల బడ్జెట్ తో నిర్మితమయిన ఈ చిత్రం 108 కోట్ల గ్రాస్ ని నమోదు చేసి… 61 కోట్ల షేర్ ను రాబట్టింది.

18) రేసుగుర్రం :అల్లు అర్జున్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 50 కోట్ల బడ్జెట్ తో నిర్మితమయ్యి… 107 కోట్ల గ్రాస్ ను నమోదు చేసి… 59 కోట్ల షేర్ ను రాబట్టింది.

19) ఈగ :రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్… ‘ఈగ’ చిత్రం 40 కోట్ల బడ్జెట్ తో రూపొంది… అన్ని భాషల్లోనూ కలిపి 105 కోట్ల గ్రాస్ ను నమోదు చేసి… 57 కోట్ల షేర్ ను రాబట్టింది.

20) దూకుడు :మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 35 కోట్ల బడ్జెట్ తో నిర్మితమయ్యి… 101 కోట్ల గ్రాస్ ను నమోదుచేసి… 56.7 కోట్ల షేర్ ను రాబట్టింది. యూ.ఎస్ లో తోలి 1 మిలియన్ సాధించిన చిత్రంగా ‘దూకుడు’ అప్పట్లో సంచలనం సృష్టించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus