మహేష్‌ ‘పాల పిట్ట’ పాటకు వార్నర్ స్టెప్పులు : రష్మిక కోరిక తీరబోతుంది : ‘జెర్సీ’ దర్శకుడితో చరణ్ యాక్షన్ మూవీ

సన్ రైజర్స్ టీమ్ కెప్టెన్ వార్నర్ గత కొద్దిరోజుల క్రితం వరకూ తెలుగు సినిమాల్లోని డైలాగులకు, పాటలకు టిక్ టాక్ వీడియోలను చేస్తూ వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చాడు. టిక్ టాక్ బ్యాన్ అయినప్పటికీ.. తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తూనే వస్తున్నాడు. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘బుట్ట బొమ్మ’ ‘రాములో రాములా’ వంటి పాటలతో పాటు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ‘మైండ్ బ్లాక్’ వంటి పాటలకు వార్నర్ డ్యాన్స్ లు చేస్తూ వచ్చాడు. తాజాగా ‘మహర్షి’ సినిమాలోని ‘పాల పిట్ట’ పాటను రీఫేస్‌ యాప్‌తో ఛేంజ్‌ చేసి.. మహేష్‌ బాబు ప్లేస్ లో తనని పెట్టుకుని స్టెప్పులు వేసినట్టు వీడియోని తీసి తన సోషల్‌ మీడియాలో పెట్టుకున్నాడు వార్నర్. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ కు జోడీగా నటించాలని తన కోరిక అన్నట్టు స్టార్ హీరోయిన్ రష్మిక ఎప్పట్నుంచో చెప్పుస్తోంది. త్వరలోనే రష్మిక కోరిక నెరవేరబోతుందట. విజయ్ తో నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించనున్న ఓ మాస్ ఎంటర్‌టైనర్ మూవీలో రష్మిక హీరోయిన్‌గా ఎంపికయ్యిందట.

‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి రాంచరణ్ రెడీ అవుతున్నాడట. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుందని సమాచారం.


Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus