12 మిలియన్.. తగ్గేదే లె : అఖిల్ కోరిక : బాలయ్య బ్రాండ్ అదే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సౌత్ ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మలయాళ, హిందీ ఇండస్ట్రీలలో కూడా అతడికి ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. అల్లు అర్జున్ నటించిన సినిమాలను మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. అక్కడి అభిమానులంతా బన్నీని మల్లు అర్జున్ అని పిలుచుకుంటుంటారు. అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు. ఇక ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో బన్నీకి బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఏర్పడింది.చాలా మంది బాలీవుడ్ స్టార్లు సౌత్ లో తమ అభిమాన హీరో బన్నీ అని చెబుతుంటారు. ఇంతటి క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అంతకుమించి ఉంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్ హీరోల కొడుకులు, కూతుళ్లు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సులభమైనా సక్సెస్ సాధించడం అంత తేలిక కాదు. నాగార్జున కొడుకుగా సినిమాల్లోకి రాకముందే ప్రేక్షకులకు సుపరిచితమైన అఖిల్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. కొత్త హీరోలు, బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలు తమ సినిమాలతో 40 నుంచి 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తుంటే అఖిల్ సినిమాల కలెక్షన్లు మాత్రం 20 కోట్లు దాటలేదు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ మాస్ సినిమాలలో ఎక్కువగా నటిస్తూ నటుడిగా సత్తా చాటుతున్నారు. బాలకృష్ణ సీరియస్ గా ఉంటారని ఆయనకు కోపం ఎక్కువని గతంలో వార్తలు వైరల్ అయినా ఆయనతో పని చేసిన నటులు మాత్రం బాలయ్య మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వమని ఆయన కల్మషం లేని మనిషని చెబుతారు. ప్రముఖ నటులలో ఒకరైన శుభలేఖ సుధాకర్ బాలయ్య గొప్పదనం గురించి కీలక విషయాలను వెల్లడించారు. బాలకృష్ణతో కలిసి మందు తాగానని ఆయనతో ఉన్న అనుబంధాన్ని శుభలేఖ సుధాకర్ గుర్తు చేసుకున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బాలనటుడిగా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించిన మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ సూపర్ స్టార్ గా వరుస విజయాలతో దూసుకెళుతున్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా మూడు హిట్లు సాధించిన మహేష్ బాబు కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొననున్నారు. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ను కూడా త్వరలోనే ప్రారంభించాలని మహేష్ భావిస్తున్నారు.అయితే ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన అభిషేక్ నామా తాజాగా మహేష్ బాబు గొప్పదనం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ… చాలా చక్కగా షోను నిర్వహించిన భేష్‌ అనిపించుకున్నారు. అయితే ఈ ఏడాది కరోనా ఇంకా దారుణంగా ఉండటంతో నిర్వాహకులు జంకుతున్నారట. మరోవైపు కరోనా మార్గదర్శకాలను అతిక్రమించారని మలయాళ బిగ్‌బాస్‌ సెట్‌ను పోలీసులు సీజ్‌ చేసి, షోను నిలిపేశారు. దీంతో తెలుగు షో విషయంలో ఇంకా ఆలస్యం చేయాలని చూస్తున్నారట. ఇదంతా పక్కనపెడితే షోకి ఎవరెవరిని తీసుకోవాలనే చర్చ ఇంకా జరుగుతోందట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus