కాజల్ డిస్కౌంట్లు : శ్రీదేవి కూతురి ఎంట్రీ ఇలా : డబ్బిస్తే సరిపోదు!

రెమ్యునరేషన్ విషయంలో హీరోయిన్లు ఎవరూ కూడా వెనక్కి తగ్గరు. కావాలంటే కాస్త ఎక్కువైనా డిమాండ్ చేస్తారు కానీ తక్కువ రెమ్యునరేషన్ కి మాత్రం పని చేయరు. అలాంటిది ఇప్పుడు కాజల్ అగర్వాల్ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలంగా గౌతమ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న కాజల్ కొన్ని నెలల క్రితమే అతడిని పెళ్లాడింది. ఒకప్పుడు పెళ్లిళ్లు అయిపోయిన హీరోయిన్లకు పెద్దగా అవకాశాలు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు ప్రేక్షకులు పెళ్లైన భామలను కూడా ఆదరిస్తున్నారు. Click Here to Read

త్రివిక్రమ్‌ సినిమా మొదలవుతుంది అని అన్నామంటే చాలు… బాలీవుడ్‌ నుండి ఓ భామ దిగొస్తుంది అనే పుకారు మొదలవుతుంది. అదెందుకో గానీ ఇటీవల కాలంలో ఈ టాక్‌ బాగా వినిపిస్తుంది. అందులో శ్రీదేవి కూతురు పేరు తప్పక ఉంటుంది. ఎలా ఈ పుకారు క్రియేట్‌ అవుతుందో కానీ… ఆ సినిమా హీరోయిన్‌ను ఓకే చేసేంతవరకు సాగుతూనే ఉంటుంది. SSMB28 కోసం ఈసారి కూడా శ్రీదేవి కూతురు పేరు వినిపిస్తోంది. అయితే పెద్ద కూతురు కాదు, చిన్న కూతురు. Click Here to Read

ప్రజలంతా కరోనాతో బాధపడుతున్న సమయంలో.. కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాలిడే ట్రిప్ కోసం మాల్దీవులకు వెళ్లడాన్ని తప్పుబట్టింది శృతిహాసన్. ఇప్పుడు చేసే సహాయాన్ని డబ్బుతో మాత్రం కొలవకూడదని చెబుతోంది. కేవలం డబ్బు ఇచ్చినంత మాత్రాన గుర్తింపు రాదని.. ఒక్కోసారి చిన్న మాటసాయం కూడా కొండంత భరోసా ఇస్తుందని చెబుతోంది. సోషల్ మీడియా ఆధారంగా సాయం చేసేప్పుడు ప్రతి విషయాన్ని సెపరేట్ గా చూడాలని చెబుతోంది. సోషల్ మీడియాలో సాయం చేయమని ఎన్నో రిక్వెస్ట్ లు వస్తుంటాయని.. Click Here to Read

సరైన హిట్టు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు హీరో కళ్యాణ్ రామ్. అతడు చివరిగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో కొత్త సినిమా మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో కొన్ని నెలల క్రితం ఓ సినిమాలు మొదలుపెట్టాడు. అయితే నిన్న ఉన్నట్లుండి తన కొత్త సినిమాను ప్రకటించాడు కళ్యాణ్ రామ్. Click Here to Read

టాలీవుడ్‌, బాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్లు, చరిత్రను తిరగరాసిన సినిమాలకు కథలు అందించారు విజయేంద్రప్రసాద్‌. ‘బాహుబలి’, ‘భజరంగీ భాయిజాన్‌’, ‘మణికర్ణిక’ ఇలా ఒక్కటేంటి వరుసగా అద్భుతమైన కథలు రాశారాయన. అంతే కాదు కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. అవి కూడా సాధారణమైన కథలు కావు. కానీ ఆయనకు దర్శకత్వం రాదు అని ఒక వ్యక్తి అన్నారట తెలుసా? అంత పెద్ద వ్యక్తిని ఆ మాట అన్నదెవరో తెలిస్తే మీరు కచ్చితంగా షాకవుతారు. ఇదేమో యూట్యూబ్‌ థంబ్‌ నెయిల్‌ టైపు కాదు. నిజంగానే షాకవుతారు! Click Here to Read

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus