Khushi Kapoor: మహేష్‌ సినిమాలో ముగ్గురు నాయికలట

త్రివిక్రమ్‌ సినిమా మొదలవుతుంది అని అన్నామంటే చాలు… బాలీవుడ్‌ నుండి ఓ భామ దిగొస్తుంది అనే పుకారు మొదలవుతుంది. అదెందుకో గానీ ఇటీవల కాలంలో ఈ టాక్‌ బాగా వినిపిస్తుంది. అందులో శ్రీదేవి కూతురు పేరు తప్పక ఉంటుంది. ఎలా ఈ పుకారు క్రియేట్‌ అవుతుందో కానీ… ఆ సినిమా హీరోయిన్‌ను ఓకే చేసేంతవరకు సాగుతూనే ఉంటుంది. SSMB28 కోసం ఈసారి కూడా శ్రీదేవి కూతురు పేరు వినిపిస్తోంది. అయితే పెద్ద కూతురు కాదు, చిన్నకూతురు.

మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమాను ఇటీవల ప్రకటించారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఈలోపు సినిమా కాస్ట్‌ అండ్‌ క్రూను ఎంపిక చేసే పనిలో ఉన్నారు త్రివిక్రమ్‌ అండ్‌ టీమ్‌. ఇందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉంటారని తెలుస్తోంది. మొన్నటివరకు ఒక్క నాయికే అని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ నెంబరు మారింది. అంతేకాదు ముగ్గురు పేర్లు కూడా బయటకు వచ్చాయి.

సినిమాలో ప్రథాన నాయికగా పూజా హెగ్డేను అనుకుంటున్నారట. మరో నాయికగా నివేదా థామస్‌ను తీసుకుంటున్నారని సమాచారం. ఇక అసలు విషయమల్లా మూడో నాయిక గురించి. ఈ పాత్ర కోసం త్రివిక్రమ్‌ అండ్‌ కో… శ్రీదేవి చిన్న తనయ ఖుషీ కపూర్‌ను తీసుకొద్దామని అనుకుంటున్నారట. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే టాక్‌. ఒకవేళ ఇదే నిజమనుకుంటే… మరీ బోనీ కపూర్‌ తన కూతురిని ఇలా గుంపులో గోవిందమ్మలా లాంచ్‌ చేస్తాడా? డౌటే. కాబట్టి ఖుషి తొలి సినిమా ఇది కాకపోవచ్చు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus