టాలీవుడ్, బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్లు, చరిత్రను తిరగరాసిన సినిమాలకు కథలు అందించారు విజయేంద్రప్రసాద్. ‘బాహుబలి’, ‘భజరంగీ భాయిజాన్’, ‘మణికర్ణిక’ ఇలా ఒక్కటేంటి వరుసగా అద్భుతమైన కథలు రాశారాయన. అంతే కాదు కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. అవి కూడా సాధారణమైన కథలు కావు. కానీ ఆయనకు దర్శకత్వం రాదు అని ఒక వ్యక్తి అన్నారట తెలుసా? అంత పెద్ద వ్యక్తిని ఆ మాట అన్నదెవరో తెలిస్తే మీరు కచ్చితంగా షాకవుతారు. ఇదేమో యూట్యూబ్ థంబ్ నెయిల్ టైపు కాదు. నిజంగానే షాకవుతారు!
విజయేంద్ర ప్రసాద్ ఇప్పటివరకు నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. వేటికవే భిన్నమైనవి. ‘రాజన్న’ తప్పితే మిగిలిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఆయన దర్శకత్వం సరిగ్గా రాదు అని అన్నారట రాజమౌళి. ఏంటీ ఆయన కొడుకే ఆ మాట అన్నారా? అంటే.. అవుననే చెప్పాలి. ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాదే చెప్పుకొచ్చారు. ‘నా కొడుకు ఇలా అన్నాడు’ అంటూ తన డైరక్షన్ సంగతి చెప్పుకొచ్చారాయన.
మరి మీరు దర్శకుడిగా సక్సెస్ అయ్యారా? లేక రచయితగానా అంటే.. ఏ మాత్రం మొహమాటం లేకుండా రైటర్‌గానే అని చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. మరి మీరు దర్శకుడిగా ఎందుకు సక్సెస్ కాలేకపోయారు అంటే… ‘ఆ విషయం తెలిసి ఉంటే పెద్ద హిట్లు కొట్టుండేవాణ్ని కదా’ అంటూ చమత్కరించారు విజయేంద్రప్రసాద్. ఇదంతా ఓ టీవీ షో కోసం చెప్పినవి. ఆ షో ఇంకా టెలీకాస్ట్ కాలేదు. టెలీకాస్ట్ అయితే ఇలాంటి విషయాలు ఇంకా చాలా బయటకు వస్తాయి. సో వచ్చే సోమవారం వరకు వెయిట్ చేయండి.
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!