ప్రజలంతా కరోనాతో బాధపడుతున్న సమయంలో.. కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాలిడే ట్రిప్ కోసం మాల్దీవులకు వెళ్లడాన్ని తప్పుబట్టింది శృతిహాసన్. ఇప్పుడు చేసే సహాయాన్ని డబ్బుతో మాత్రం కొలవకూడదని చెబుతోంది. కేవలం డబ్బు ఇచ్చినంత మాత్రాన గుర్తింపు రాదని.. ఒక్కోసారి చిన్న మాటసాయం కూడా కొండంత భరోసా ఇస్తుందని చెబుతోంది. సోషల్ మీడియా ఆధారంగా సాయం చేసేప్పుడు ప్రతి విషయాన్ని సెపరేట్ గా చూడాలని చెబుతోంది. సోషల్ మీడియాలో సాయం చేయమని ఎన్నో రిక్వెస్ట్ లు వస్తుంటాయని..
కానీ వాటిని ఒకే కోణంలో చూడలేమని అంటోంది శృతి. డబ్బు ఎక్కువమందికి అవసరమేనని కానీ.. కేవలం డబ్బు ఇవ్వడంతోనే మనం పెద్ద మనసు చాటుకున్నట్లు అవ్వడాన్ని చెప్పింది. ఒక్కోసారి మనం షేర్ చేసే చిన్న సమాచారం కూడా కొంతమందికి ఉపయోగపడొచ్చని.. నేను ఎప్పుడూ ఆ కోణంలోనే ఆలోచిస్తానని చెబుతోంది. సోషల్ మీడియాలో వచ్చే రిక్వెస్ట్ లలో నిజాలు, నకిలీవి కనిపెట్టడం చాలా కష్టమని..
దానికోసం ఓ చిన్న టీమ్ ను ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతోంది శృతిహాసన్. ఎందుకంటే తనకు తానుగా ఈ పని చేయలేనని.. శ్రీరామ్ అనే వ్యక్తి తనకు సాయం చేస్తున్నాడని.. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ను వాళ్లు అందిస్తున్నారని.. అదే తను పోస్ట్ చేస్తానని చెప్పుకొచ్చింది.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!