‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

ఓ బిగ్ బాస్ బ్యూటీ కారుతో బైక్ ను ఢీ కొట్టి పరారవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. దీంతో ఆమెపై ‘హిట్ అండ్ రన్’ కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళ్ళితే.. ప్రముఖ నటి అలాగే కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి దివ్య సురేష్… అర్ధరాత్రి 1 :30 గంటలకు బైతరాయణపురలో నిత్య హోటల్ వద్ద ఓ బైకును ఢీ కొట్టింది. ఆ బైకుపై వెళ్తున్న ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తుంది.

Divya Suresh

దీంతో వారి బంధువు అయినటువంటి కిరణ్ దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్టు సమాచారం. తమ బంధువులు అయినటువంటి అనూష, అనిత.. బైకుపై వెళ్తున్న సమయంలో ఓ నలుపు రంగు కారు వెనుక నుండి వచ్చి ఢీ కొత్తగా వారు కింద పడిపోవడంతో తీవ్రగాయాలు అయ్యాయని, ఈ క్రమంలో.. ఢీ కొట్టిన కారు ఆగకుండా వెళ్ళిపోయినట్టు అతను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాసుకొచ్చినట్టు తెలుస్తుంది.

వారి కంప్లైంట్ ను స్వీకరించిన బైతరాయణపుర పోలీసులు ఆ కారు.. ఓ నటికి చెందినది అని గుర్తించారు. విచారణలో భాగంగా సేకరించిన సీసీ టీవీ ఫుటేజీలో… ఆ నటి కారులో ఉన్నట్టు గుర్తించారు. కానీ బాధితులైన వారు ఆలస్యంగా కంప్లైంట్ ఇవ్వడంతో.. ఈ వార్త కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. మరోపక్క పోలీసులు నటి అయినటువంటి దివ్య సురేష్ పై కేసు నమోదు చేశారు. అలాగే విచారణకు హాజరుకావాలని నోటీసులు కూడా పంపినట్టు తెలుస్తుంది.

ఇక దివ్య సురేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘టెంప్ట్ రాజా’ అనే తెలుగు సినిమాలో ఆమె నటించింది. కన్నడ బిగ్ బాస్ తో ఆమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus