Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 6, 2025 / 07:45 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ ముఖ్ (Hero)
  • క్వలిన్ ఫెర్నాండేజ్, నర్గీస్ ఫక్రి (Heroine)
  • నానా పాటేకర్ తదితరులు.. (Cast)
  • తరుణ్ మనుష్కాని (Director)
  • సాజిద్ నడియాడ్ వాలా - ఫిరుజి ఖాన్ (Producer)
  • జూలియస్ ప్యాకియం (Music)
  • వి.మణికందన్ (Cinematography)
  • Release Date : జూన్ 06, 2025
  • నడియాద్వాల గ్రాండ్స్లోన్ ఎంటర్టైన్మెంట్ (Banner)

బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ లో “హౌస్ ఫుల్” ఒకటి. ఇప్పటివరకు వచ్చిన 4 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, దాంతో 5వ పార్ట్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి రావాల్సినంత హైప్ రాకపోవడంతో.. ఈ సినిమాకి రెండు క్లైమాక్స్ ను డిజైన్ చేసి.. హౌస్ ఫుల్ 5A, 5B అంటూ రెండు రకాల క్లైమాక్స్ లను థియేటర్లలో రిలీజ్ చేసారు. ఈ క్రమంలో.. ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి సినిమా ఎలా ఉంది? ఫ్రాంచైజ్ స్థాయిలో హిట్ అయ్యిందా లేదా? అనేది చూద్దాం..!!

House Full 5 A & B Review

House Full 5 A & B Movie Review and Rating (1)

కథ: 69 బిలియన్ పౌండ్ల ఆస్తిపరుడు రంజీత్ అకాల మరణంతో.. అతడి ఆస్తి కొట్టేయడం కోసం అతని కొడుకుగా ఎంట్రీ ఇస్తారు జూలియస్ (అక్షయ్ కుమార్), జలాబుద్దీన్ (రితేష్ దేశ్ ముఖ్), జల్ భూషన్ (అభిషేక్ బచ్చన్).

ఈ ముగ్గురిలో అసలు జాలీ ఎవరు? ఆస్తి కోసం ఈ ముగ్గురు చేసిన హంగామా ఏమిటి? ఈ ముగ్గురు కాకుండా ఆస్తి కోసం వెంపర్లాడుతున్న మరొకరు ఎవరు? అనేది “హౌస్ ఫుల్ 5” కథాంశం.

House Full 5 A & B Movie Review and Rating (1)

నటీనటుల పనితీరు: ఈ సినిమాలో ఒకరు బాగా నటించారు, మరొకరు నటించలేదు అని చెప్పడానికి లేకుండా.. అందరూ ఓవర్ యాక్షన్ తో చిరాకు పుట్టించారు.

హీరోయిన్లైతే కేవలం అంగాంగ ప్రదర్శన కోసం మాత్రమే ఉన్నారు. సినిమాలో కనిపించే ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఫ్రేములో కుదిరితే యద లేకపోతే పిరుదుల దగ్గర టైట్ క్లోజ్ పెట్టి దర్శకనిర్మాతలు తమ పైత్యాన్ని ఘనంగా చాటుకున్నారు.

ఇక మిగతా పాత్రధారులు చేసే బీ గ్రేడ్ కామెడీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే.. అంత మంచిది.

House Full 5 A & B Movie Review and Rating (1)

సాంకేతికవర్గం పనితీరు: సినిమాలో బీ గ్రేడ్ జోక్స్ ఉండడం, శృంగారపరంగా ప్రేరేపితంగా సంభాషణలు ఉండడం అనేది ఇదివరకు “గ్రాండ్ మస్తీ, మస్త్ రామ్, హంటర్” వంటి సినిమాల్లో చూసాం. కానీ.. మొదటిసారి బిలో ది బెల్ట్ కామెడీ అసహ్యం పుట్టించింది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ లాంటి ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఇంత దిగజారుడు కామెడీ చేయడం అనేది బాధాకరం. ఇందుకు దర్శకుడు తరుణ్, కథ-స్క్రీన్ ప్లే అందించిన నిర్మాత సాజిద్ నడియాడ్ వాలాలను నిందించాలి.

అయితే.. టెక్నికల్ గా మాత్రం మేకింగ్ విషయంలో అస్సలు రాజీపడలేదు మేకర్స్. సీజీ & బ్లూ మ్యాట్ షాట్స్ ను చాలా జాగ్రత్తగా భారీగా ఖర్చు చేశారు. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ టీమ్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు.

అయితే.. టెక్నికల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ.. నీచమైన డబుల్ మీనింగ్ డైలాగ్స్ & బీ గ్రేడ్ కంటే బీలో లెవల్ కామెడీ కారణంగా టెక్నీషియన్స్ వర్క్ ఏదీ ఎలివేట్ అవ్వలేదు.

House Full 5 A & B Movie Review and Rating (1)

విశ్లేషణ: “గ్రాండ్ మస్తీ, గ్రేట్ గ్రాండ్ మస్తీ” లాంటి బీ గ్రేడ్ సినిమాలు చూస్తున్నప్పుడు ఎక్కడా అసహ్యం కలగదు. ఎందుకంటే.. ఆ తరహా సినిమా నుంచి ఏం ఊహిస్తామో అదే అందిస్తుంది ఆ చిత్రం. అయితే “హౌస్ ఫుల్” ఫ్రాంచైజ్ వేరు. ఇది స్లాప్ స్టిక్ కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ సినిమాకి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటప్పుడు సంబంధం లేని కేటగిరి జోకులను, ఎక్స్ పోజింగులను ఇరికించకూడదు. ఆ ఇరికించడం కారణంగా “హౌస్ ఫుల్ 5” కనీస స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక సినిమాకి రెండు క్లైమాక్సులు అంటూ బృందం తెగ హడావుడి చేసింది కదా, 5A & 5B కి మధ్య తేడా ఏంటంటే.. 5Aలో ఫర్దీన్ ఖాన్ & అభిషేక్ బచ్చన్ లు విలన్ లు కాగా, 5Bలో చిత్రాంగద సింగ్ & అభిషేక్ బచ్చన్ లు విలన్లు. ఈ మాత్రం దానికోసం ఈ సినిమాని 5A ఒకసారి, 5B ఒకసారి చూడాల్సిన అవసరం ఏమాత్రం లేదు.

House Full 5 A & B Movie Review and Rating (1)

ఫోకస్ పాయింట్: ‘బీ గ్రేడ్’ కంటెంట్ తో ‘హౌస్ ఫుల్’ అవ్వడం చాలా కష్టం!

రేటింగ్: 1/5

Rating

1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Bachchan
  • #Akshay Kumar
  • #House Full 5 A & B
  • #Jacqueline Fernandez
  • #Nargis Fakhri

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

18 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

19 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

23 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

2 days ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version