Devara: ‘వార్‌’కి సిద్ధమైన ‘దేవర’… రెండూ ఒకేసారి ఎలా సాధ్యం?

బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మక యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌తో తారక్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఉంటుందని గత కొన్ని నెలలుగా వార్తలొస్తున్నాయి. ఆ సినిమా ‘వార్‌ 2’ అని కూడా ప్రకటించారు. అయితే ఇంకా తారక్‌ (Jr NTR) ఇంకా ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొనకపోవడంతో చాలా అనుమానాలు వస్తున్నాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు టీమ్‌ క్లియర్‌ చేస్తూ ఉంది. సినిమాలో తారక్‌ పాత్రల బలంగా ఉంటుంది అంటూ ఈ మధ్య లీక్‌ ఇచ్చారు. తాజాగా ఈ నెల సెకండాఫ్‌లో షూటింగ్‌ అంటూ మరో లీక్‌ ఇచ్చారు.

అయితే, ఇక్కడే ఓ డౌట్‌ వచ్చి పడింది. ఒకవేళ టీమ్‌ చెబుతున్నట్లు ‘వార్‌ 2’ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర చిత్రీకరణ ఈ నెల ద్వితీయార్ధంలో స్టార్ట్‌ అయితే ‘దేవర’ (Devara) సినిమా లుక్‌లోనే ఆ సినిమాకూ వర్క్‌ చేస్తాడా? అని. ఎందుకంటే దేవర కోసం తారక్‌ కాస్త రగ్గ్‌డ్‌ లుక్‌, జుట్టు ఉంచాడు. ‘వార్‌ 2’ కోసం టీమ్‌ చెబుతున్నట్లు స్పై పాత్ర పోషిస్తున్నట్లయితే… ‘దేవర’లుక్‌ ఎలా సరిపోతుందని అంటున్నారు. అయితే ఆ సినిమా కోసం విగ్‌ పెట్టుకుంటే చేసేదేం లేదు.

అయితే, వినిపిస్తున్న మరో వార్త ప్రకారం అయితే… తారక్‌ ఇప్పుడు షూటింగ్‌లో హాజరవవ్వడని… కేవలం మేకోవర్‌ కోసమే వెళ్తున్నాడని చెప్పొచ్చు. కొత్త పాత్ర కోసం ఎన్టీఆర్‌ ఫుల్‌ ఫిట్‌నెస్‌గా కనించాల్సి ఉందట. దీని కోసం తారక్‌ ఫిట్‌నెస్‌లో స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకోబోతున్నాడట. రెండు వారాల పాటు ఫిట్‌నెస్‌ కోర్స్‌ తర్వాత సినిమా షూటింగ్‌ ఉంటుంది అని చెబుతున్నారు. అంటే ఈ నెలలో ‘వార్‌ 2’ షూటింగ్‌ మొదలయ్యే పరిస్థితి లేదు.

అయితే ఇక్కడా ఓ డౌట్‌. ఇప్పుడు ‘వార్‌ 2’ సినిమా కోసం మేకోవర్‌ అయి అటు వెళ్తే… ‘దేవర’ షూటింగ్‌ సంగతి ఏంటని? రెండు భాగాలు రానున్న ఈ సినిమా ఎప్పుడు పూర్తి చేస్తారు? అసలు ఎందుకు హోల్డ్‌లో పెడతారు అనే ప్రశ్న కూడా వస్తుంది. దీనిపై ఎన్టీఆర్‌ టీమ్‌ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus