బన్నీ లుక్ ఎలా సెట్ చేసారు?

Advertisement

అల్లు అర్జున్ తన పుట్టినరోజు కానుకగా ఫ్యాన్ కి పెద్ద గిఫ్టే ఇచ్చాడు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న 20వ చిత్ర టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. పుష్ప అనే ఆసక్తికర టైటిల్ ని నిర్ణయించిన సుకుమార్ లుక్ కూడా చాలా భిన్నంగా సెట్ చేశారు. చింపిరి జుట్టు, మెడలో తాయత్తు, మాసిన బట్టలు, తోలు చెప్పులు ధరించి ఉన్న అల్లు అర్జున్ డీగ్లామర్ లుక్ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేర్చింది.

సెకండ్ లుక్ లో బన్నీని ఎర్ర చందనం దొంగిలిస్తూ పట్టుబడిన దొంగలా పరిచయం చేశారు. బన్నీ లారీ డ్రైవర్ అని ప్రచారం జరుగుతుండగా తాజా ఫోటో కొత్త డౌట్స్ రేపుతోంది. ఐతే బన్నీ లుక్ ఎలా సెట్ చేశారు అనేది ఆసక్తికర అంశం. నిజానికి బన్నీ ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ లో అసలు పాల్గొనలేదు. బన్నీ అల వైకుంఠపురంలో ప్రమోషన్ కార్యక్రమాలో ఉండగా సుకుమార్ కేరళలో ఆయన లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశాడు.

సెకండ్ షెడ్యూల్ కేరళలోనే మొదలుకావాల్సి ఉండగా కారోనా కర్ఫ్యూ కారణంగా వాయిదా పడింది. దీనితో అల్లు అర్జున్ సుకుమార్ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదు. ఇక బహుశా ఫస్ట్ లుక్ కోసం టీమ్ ఏదో స్టూడియోలోని ప్రత్యేక సెట్ లో దీనికి సంబందించిన సెట్ వేసి ప్రిపేర్ చేసివుండవచ్చు. ఎలా వారు ఈ ఫస్ట్ లుక్ సెట్ చేసినా స్పందన మాత్రం అదిరింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఐదు భాషలలో విడుదల కానుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus