నాగార్జున- నాగ చైతన్య కాంబినేషన్లో రూపొందిన ‘బంగార్రాజు’ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ‘సోగ్గాడు చిన్నినాయన’ కి సీక్వెల్ గా రూపొందింది. కళ్యాణ్ కృష్ణ కురసాల నే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాకే లభించింది. పండుగ హాలిడేస్ ను బాగా క్యాష్ చేసుకున్న ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేలోపు 90శాతం రికవరీని సాధించే అవకాశం కనిపిస్తుంది.
రెండో వీకెండ్ అలాగే రిపబ్లిక్ డే హాలిడే కూడా ‘బంగార్రాజు’ కి కలిసొచ్చే అంశాలు. ఇదిలా ఉండగా.. కొత్త సినిమాలు రిలీజ్ అయితే సోషల్ మీడియాలో ఆ మూవీ గురించి ఏదో ఒక డిస్కషన్ నడుస్తుంది అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘బంగార్రాజు’ విషయంలో కూడా అదే జరుగుతుంది. అయితే ఈ చిత్రంలో ఓ లాజిక్ ను కనిపెట్టి.. తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు నెటిజన్లు. విషయంలోకి వెళితే.. ‘సోగ్గాడే చిన్నినాయన’ కి ఎండింగే ఈ చిత్రానికి ఆరంభంగా చూపించారు.
సినిమా ప్రారంభంలో చిన్న బంగార్రాజు తల్లి సీత(లావణ్య త్రిపాఠి) చనిపోయినట్టు చూపించారు. కొంతసమయానికి పెద్ద ‘బంగార్రాజు’ స్వర్గంలో రంభ ఊర్వశి మేనకాలతో డ్యూయెట్ లు వేసుకుంటున్నట్టు చూపించారు. ఆ డ్యూయెట్లు అయిపోగానే సత్య అలియాస్ సత్తెమ్మ(రమ్యకృష్ణ) స్వర్గంలోకి వచ్చినట్టు చూపిస్తారు. తర్వాత వాళ్ళిద్దరూ భూమ్మీదకి రావడం ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దడం అందరికీ తెలిసిన సంగతి.
అయితే సత్తెమ్మ కంటే ముందు చనిపోయిన సీత ఎందుకు స్వర్గంలో కనిపించలేదు అనేది నెటిజెన్ల అనుమానం. సినిమా పరంగా ఇక్కడ లాజిక్ మిస్ అయినట్టే..! కానీ ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి ఉంటే చైతన్యకి తల్లిగా చూపించాల్సి వస్తుంది. ఆల్రెడీ చైతన్య సరసన లావణ్య హీరోయిన్ గా నటించింది కాబట్టి.. ఆమె పాత్రని ఈ చిత్రంలో కంటిన్యూ చేయడం ఎందుకు అని.. ఆమెని చనిపోయినట్టు చూపించామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. సినిమా చూసేటప్పుడు లాజిక్ లు పట్టించుకోకూడదు అని ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవాలి.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!