Kingdom: ‘కింగ్డమ్’ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే?

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో ‘#VD12’ గా ‘కింగ్డమ్’ (Kingdom) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse)  హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరో సత్యదేవ్ (Satya Dev) కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘శ్రీకర స్టూడియోస్’ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ‘ఫార్చ్యూన్ ఫోర్’ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య (Sai Soujanya) కలిసి ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Kingdom

మే 30న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సాంగ్ విషయానికి వస్తే.. ఇది 4 నిమిషాల 41 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘ఏదో ఏదో గమ్మత్తులా ఏంటీ కల.. ఏంటీ కల..!ఏదో ఏదో అయ్యేంతలా…’ అంటూ ఈ పాట మొదలైంది. ఈ లిరిక్స్ అలాగే విజువల్స్ కథ లోతును తెలియజేసే విధంగా ఉన్నాయి. హీరో, హీరోయిన్ ప్రేమించుకుంటున్నప్పటికీ.. అందరి ముందు ప్రేమించుకుంటున్నట్టు నటిస్తున్నాం అని కవర్ చేసుకుంటూ ఉంటారు.

మరోపక్క హీరో హత్యలు చేస్తున్నాడు. వాటికి హీరోయిన్ మద్దతు పలుకుతోంది. ఈ ఎలిమెంట్స్ అన్నీ సినిమాపై ఆసక్తి కలిగిస్తున్నాయి. కృష్ణ కాంత్ అందించిన లిరిక్స్, అనిరుధ్ సమకూర్చిన ట్యూన్ ఆకట్టుకునే విధంగా ఉంది. అలాగే అనిరుధ్, అనుమిత వోకల్స్ కూడా బాగా సెట్ అయ్యాయి. ఒక్కసారి వినగానే ఎక్కేసేలా ఈ పాట ఉంది అని చెప్పాలి. మీరు కూడా ఒకసారి చూస్తూ వినండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus