టాలీవుడ్లో రూపొందుతున్న వరుస పాన్ ఇండియా సినిమాల్లో ‘స్వయంభు’ (Swayambhu) ఒకటి. ఈ సినిమా ఒకటి ఉందని చాలా మంది మర్చిపోయారు. దీని గురించి ఎక్కువ అప్డేట్స్ రాకపోవడం వల్ల ఆడియన్స్ ఈ సినిమాని మర్చిపోయారు అనుకోవచ్చు.కానీ ఇది తీసిపారేసే సినిమా కాదు. ‘కార్తికేయ 2’ (Karthikeya 2) తో తెలుగుతో పాటు హిందీలో కూడా సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ (Nikhil Siddharth) హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.
మరో హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. హీరో నిఖిల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడి 6 ప్యాక్ బాడీ బిల్డ్ చేశారు. ఇదొక చారిత్రాత్మక చిత్రం. నిఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఇదిలా ఉండగా.. ‘స్వయంభు’ చిత్రం మరో నెల రోజుల్లో కంప్లీట్ అయిపోతుందట.వి.ఎఫ్.ఎక్స్ పనులు వంటివి కూడా సమాంతరంగా మొదలైనట్టు తెలుస్తుంది.
ఇక ‘స్వయంభు’ చిత్రం విడుదల తేదీని కూడా ఫిక్స్ చేసినట్లు ఇప్పుడు టాక్ నడుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘స్వయంభు’ ని సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇండియా సినిమాలకి సెప్టెంబర్ అనేది మంచి టైం. హిందీ మార్కెట్ కూడా ఆగస్టు, సెప్టెంబర్ లో చాలా బాగుంటుంది. అందుకే ‘స్వయంభు’ మేకర్స్ ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే నెలలో ‘అఖండ’ అనే మరో పాన్ ఇండియా సినిమా కూడా రిలీజ్ కాబోతోంది.