ఆ విషయంలో అఖిల్ కి బాలీవుడ్ హీరో స్ఫూర్తి

అక్కినేని నాగేశ్వరరావుకి మహిళలలో ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది. అలాగే అతని వారసుడిగా వచ్చిన కింగ్ నాగార్జున కి కూడా అమ్మాయిల్లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. వీరిద్దరూ సినిమాల్లో వచ్చి అభిమానులను ఏర్పరుచుకుంటే.. దేవదాస్ మనవడు.. మన్మధుని వారసుడు అఖిల్ మాత్రం సినిమాల్లోకి రాకముందే అమ్మాయిల రాకుమారుడు అయ్యాడు. అఖిల్ సినిమా చేయకముందే అనేక సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. ఇలా పేరు సంపాదించుకోవడానికి అతని బాడీ కూడా కారణం. నిత్యం ఫిజిక్ పై అఖిల్ దృష్టి పెడుతారు. సిక్స్ ప్యాక్ బాడీని కొనసాగిస్తున్నారు. ఇలా తన శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి స్ఫూర్తి బాలీవుడ్ హీరో అని తెలిసింది.

హృతిక్ రోషన్ ఎప్పుడూ బాడీని ఫిట్ గా ఉంచుకుంటారు. సిక్స్ ప్యాక్ బాడీతో సినిమాల్లో స్టెప్పులు, ఫైట్స్ చేస్తుంటారు. అతన్ని ఆదర్శంగా తీసుకొని అఖిల్ కసరత్తు చేస్తుంటారని సమాచారం. అఖిల్, హలొ సినిమా తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్నారు. ఇందులో నవ మన్మధునిగా అఖిల్ రెచ్చిపోతారని ఫస్ట్ లుక్ తెలిపింది. బీవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus