Devara: దేవర మూవీ ప్రమోషన్స్ లో హృతిక్ కనిపించే ఛాన్స్ ఉందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  దేవర (Devara)   సినిమా విడుదలకు సరిగ్గా రెండు వారాల సమయం మాత్రమే ఉంది. దేవర సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తితో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల వరకు పరవాలేదు కానీ ఇతర రాష్ట్రాల్లో దేవరపై అంచనాలు పెరగాలంటే జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గా ఏమైనా చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే తారక్ తెలివిగా అడుగులు వేస్తున్నారు.

Devara

బాలీవుడ్ ప్రమోషన్స్ పై తారక్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. హృతిక్ రోషన్ (Hrithik Roshan) సైతం దేవర సినిమాను ప్రమోట్ చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర మూవీ ప్రమోషన్స్ లో హృతిక్ కనిపించే ఛాన్స్ ఉందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసినా సంచలనం అవుతుంది. దేవర (Devara) ఏపీ హక్కులు 55 కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది.

బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో పాటు టికెట్ రేట్లు పెంచితే మాత్రమే దేవర (Devara) ఏపీలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉంది.దేవర సినిమా టాక్ ఆధారంగా తారక్ భవిష్యత్తు సినిమాల బిజినెస్ ఆధారపడి ఉంటుంది. కొరటాల (Koratala Siva)  గత సినిమా ఫ్లాప్ కావడం మాత్రమే దేవర ఫ్యాన్స్ ను కొంతమేర టెన్షన్ పెడుతోంది. దేవర సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కల్ని మార్చే సినిమా అవుతుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దేవర సినిమా రిలీజ్ సమయానికి ఈ పరిస్థితి మారుతుందేమో చూడాల్సి ఉంది. దేవర ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. దేవర సినిమా ట్రైలర్ల ఇతర భాషల వెర్షన్లకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. తారక్ కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

హిట్టు కాంబినేషనే.. కానీ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus