Nithiin: హిట్టు కాంబినేషనే.. కానీ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా?

నితిన్ (Nithiin) తండ్రయ్యాడు. అతని భార్య షాలిని ఈ మధ్యనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నితిన్ అండ్ ఫ్యామిలీ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. అతని సినిమాలు కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో ‘తమ్ముడు’ (Thammudu) , వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ (Robinhood) వంటి క్రేజీ చిత్రాల్లో నితిన్ నటిస్తున్నాడు. తన భార్యకి డెలివరీ డేట్ ఇవ్వడంతో ఈ సినిమాల షూటింగ్లకి కొంత బ్రేక్ ఇచ్చాడు నితిన్. త్వరలోనే ఈ సినిమాల బ్యాలెన్స్ సినిమాల షూటింగ్ ను కంప్లీట్ చేస్తాడు.

Nithiin

అలాగే తన నెక్స్ట్ ప్రాజెక్టులపై కూడా ఫోకస్ పెట్టాడు నితిన్. ఈ క్రమంలో ’90’s’ (90’s – A Middle-Class Biopic) దర్శకుడు ఆదిత్య (Aditya Haasan) చెప్పిన కథకి నితిన్ ఓకే చెప్పాడు. ప్రస్తుతం దాని స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఆదిత్య ఉన్నాడు. అలాగే మరో దర్శకుడు చెప్పిన కథకి కూడా నితిన్ ఓకే చెప్పినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. విక్రమ్ కె కుమార్ (Vikram kumar) చెప్పిన ఓ కథకి నితిన్ (Nithiin) గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

విక్రమ్ కుమార్ తీసిన గత చిత్రాలు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ (Nani’s Gang Leader) ‘థాంక్యూ’ (Thank You) వంటివి ఆడలేదు. ఈ క్రమంలో అతనితో సినిమా అంటే కొంత రిస్క్ అనే చెప్పాలి. కానీ ‘దూత’ (Dhootha)  వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. విక్రమ్ కుమార్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. అంతేకాకుండా నితిన్ (Nithiin) ప్లాపుల్లో ఉన్నప్పుడు ‘ఇష్క్’ చేసి అతన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది కూడా విక్రమ్ కుమారే..! కాబట్టి.. ఈ కాంబినేషన్ పై హైప్ అయితే ఉంది.

దేవరలో సైఫ్ కూడా డ్యూయల్ రోల్ లో కనిపిస్తారా.. కొరటాల ఏం చేస్తారో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus