Alpha: యశ్‌ ‘స్పై’ యూనివర్స్‌లోకి అమ్మాయిలు.. ఎలా కనెక్ట్‌ చేస్తున్నారంటే?

‘సినిమాటిక్‌ యూనివర్స్‌’ కాన్సెప్ట్‌.. ఇప్పుడు ఇండియన్‌ సినిమాలో మనీ మింటింగ్‌ కాన్సెప్ట్‌ అయిపోయింది. ఆ తరహా సినిమా అనగానే.. నెక్స్ట్‌ ఏం చూపిస్తారో అంటూ అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తర్వాత ఏమొస్తుంది, హీరో ఎవరు, ఈసారి ఏం చెబుతారు అంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో కూడా సినిమాటిక్‌ యూనివర్స్‌ (Alpha) రెడీ చేశారు. అయితే నిర్మాణ సంస్థ ఈ పని చేసింది.

Alpha

బాలీవుడ్‌లో సీనియర్‌ మోస్ట్‌ నిర్మాణ సంస్థ అయిన యశ్‌రాజ్‌ ఇటీవల సినిమాటిక్‌ యూనివర్స్‌ను స్టార్ట్‌ చేసింది. యశ్‌రాజ్‌ స్పై సినిమాటిక్‌ యూనివర్స్‌ అది. అందులో వరుసగా స్పై సినిమాలే తెరకెక్కిస్తారు. ఈ క్రమంలో అమ్మాయిల్ని కూడా ఈ యూనివర్స్‌లోకి తీసుకొచ్చారు. దేశాన్ని పాలించడానికి వస్తున్నారు ‘ఆల్ఫా’ (Alpha) అమ్మాయిలు అంటూ ఇటీవలే తన రాబోయే చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

ఆలియా (Alia Bhatt) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శర్వరీ వాఘ్‌ (Sharvari Wagh) ఓ కీలక పాత్రధారి. శివ్‌ రావేల్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అగ్ర కథానాయకుడు హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) కూడా నటిస్తాడు అని అంటున్నారు. అంతేకాదు ఆయన అలియా పాత్రకు గురువుగా కనిపిస్తాడట. ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ స్టార్ట్‌ అయింది అని కూడా చెబుతున్నారు. ఇక మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా… రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ను త్వరలోనే మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈసారి (Alpha) షూటింగ్‌ కశ్మీర్‌లో ఉంటుంది అని చెబుతున్నారు. ఇక హృతిక్‌ను ఇలా చూపించడం వెనుక ‘ఆల్ఫా’ అమ్మాయిల్ని యూనివర్స్‌లోకి కలిపే ఆలోచన ఉంది అని అంటున్నారు. ఈ యూనివర్స్‌లోకి మరింతమంది హీరోలు వస్తారు, కొత్త కాంబినేషన్లు వస్తాఇ. అలా కొత్త కథలూ వస్తాయి. ఇప్పటికే హృతిక్‌ – తారక్‌ (Jr NTR) కాంబోలో ‘వార్‌ 2’ సిద్ధమవుతోంది. వీరి కాంబినేషన్‌లోనే ‘వార్‌ 3’ కూడా ఉంది అని అంటున్నారు. ఇప్పుడు ‘ఆల్ఫా’ అమ్మాయిలకు మేజర్ కబీర్‌ (హృతిక్‌) శిక్షణ ఇస్తాడు అని తేలింది. ఇంకా ఎన్ని విషయయాలు ఉన్నాయో ఈ సినిమాలో పోను పోను తెలుస్తాయిలెండి.

తొలి సినిమాతోనే మోక్షజ్ఞ పాన్ ఇండియా హిట్ అందుకుంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus