నిన్నటి తరం నటీమణి కుట్టి పద్మిని గురించి ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలిసుండకపోవచ్చు. 3 ఏళ్ళ ప్రాయంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. కొంతకాలానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించింది.చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈమె చాలా సినిమాల్లో నటించారు. ఈమెకు ఆరోజుల్లో మంచి ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చేవి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలుపుకుని ఈమె రెండు వందలకు పైగా సినిమాల్లో నటించింది. ‘కుళంద్యం దైవమమ్’ అనే చిత్రానికి గాను ఈమె ఉత్తమ బాలనటిగా నేషనల్ అవార్డు అందుకుంది.
పద్మిని తల్లి రాధ కూడా మంచి నటిగా పాపులర్ అయ్యారు. సావిత్రి, రాధ వంటి స్టార్ హీరోయిన్లు పద్మిని తల్లికి మంచి స్నేహితులు కావడంతో పద్మినికి మూడు నెలల వయసున్నప్పుడే సావిత్రి చిన్నప్పటి పాత్రల్లో కనిపించడం మొదలుపెట్టింది. ఇక చాలా కాలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పద్మిని.. తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. పద్మిని మాట్లాడుతూ.. “నాకు రెండు సార్లు వివాహం జరిగింది. మొదటి భర్త తాగుడుకు బానిస కావడంతో విడిపోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత ప్రభు అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు. అయితే నా మొదటి భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారు అని తెలిసి, మేమే తీసుకువచ్చి, మా ఆఫీస్ కింద రూమ్ కట్టి, చూసుకున్నాము. స్నేహితుడిగా అతన్ని జాగ్రత్తగా చూసుకునేదాన్ని. 2022 లోనే ఆయన కాలం చేశారు. మరొకరితో జీవితం పంచుకున్నాక.. మొదటి భర్తతో బెడ్ ను పంచుకోలేను కానీ, అలా వదిలేయాలని అనిపించలేదు.
ఆఫీసులో అతనికి ఉద్యోగం ఇచ్చి రూ. 30 వేలు జీతం కూడా ఇచ్చేవాళ్ళం. మరోపక్క నా రెండో భర్త ప్రభు..తన సెక్రటరీతో ప్రేమలో పడ్డారు. వాళ్ళ పెళ్లికి కూడా నేను అంగీకరించాను. కానీ నా పిల్లలు ఒప్పుకోలేదు.దీంతో మమ్మల్ని వదిలేసి, ఆయన తన సెక్రటరీని వివాహం చేసుకున్నారు. నేను ఒంటరిగా ఉంటున్నాను, అయినప్పటికీ ఆనందంగా ఉన్నాను. నా కుమార్తెల్లో ఒకరు లాయర్. నా పిల్లలే నాకు బలం.” అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!