భారీ బడ్జెట్ పెట్టడానికి దిల్ రాజు రెడీ!

Advertisement

ఎప్పుడైతే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేశారో.. అప్పటినుండి ఈ సినిమాకి సంబంధించిన ఏదొక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమా బడ్జెట్ కి సంబంధించి రకరకాల మీమ్స్ పుట్టుకొచ్చాయి. నిర్మాత దిల్ రాజు, శంకర్ ని భరించలేడంటూ కామెడీ మీమ్స్ ని క్రియేట్ చేశారు. ఇదిలా ఉండగా.. దిల్ రాజు బ్యానర్ లో వస్తోన్న 50వ సినిమా ఇది.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు దిల్ రాజు. అందుకే రెమ్యునరేషన్ విషయంలో కూడా రాజీ పడడం లేదు. దర్శకుడు శంకర్ తో చర్చించిన అనంతరం దిల్ రాజు ఈ సినిమాకి రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించుకున్నాడట. ఇందులో చాలా వరకు నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్ కే సరిపోతుంది. కానీ ఇంత మొత్తంలోనే సినిమా తీయాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యాడు. అదే విషయాన్ని శంకర్ కి కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకి వస్తోన్న హైప్ చూస్తుంటే రూ.150 కోట్లు రికవర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తుంది. పైగా దర్శకుడు శంకర్ సినిమాలకు సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తన పాపులారిటీ మరింత పెంచుకుంటాడని.. కాబట్టి తన తదుపరి సినిమాకి క్రేజ్ రావడం ఖాయమని నమ్ముతున్నారు. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్స్ రూపంలోనే వంద కోట్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus