మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం విశ్వంభర సినిమాకే పూర్తిస్థాయిలో పరిమితం కాగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మల్లిడి వశిష్ట (Mallidi Vasishta) బింబిసార సినిమాతో భారీ హిట్ సొంతం చేసుకున్న నేపథ్యంలో విశ్వంభర (Vishwambhara) తెలుగు రాష్ట్రాల హక్కులే ఏకంగా 120 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడవుతున్నాయని సమాచారం. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండటం ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతోంది. విశ్వంభర సినిమాలో ఒక సన్నివేశం సీజీ కోసమే మేకర్స్ 12 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది.
సినిమాకు ఆ ఒక్క సీన్ ఎంతో కీలకమని అందుకే ఈ స్థాయిలో మేకర్స్ ఖర్చు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విశ్వంభర మూవీ సెకండాఫ్ లో గ్రాఫిక్స్ కు ఎక్కువగానే ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. అయితే కొన్ని సినిమాలకు గ్రాఫిక్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆ స్థాయిలో ఔట్ పుట్ రావడం లేదు.
విశ్వంభర విషయంలో ఆ తప్పు జరగకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి, త్రిష (Trisha) కాంబినేషన్ లో స్టాలిన్ (Stalin) తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. విశ్వంభర సినిమా రిజల్ట్ విషయంలో చిరంజీవి పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం అందుతోంది.
200 కోట్ల రూపాయల బడ్జెట్ రిస్కీ బడ్జెట్ అయినా విశ్వంభర (Vishwambhara) సినిమాతో చిరంజీవి పాన్ ఇండియా హిట్ సాధించడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. విశ్వంభర సినిమాకు పోటీ ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో ఈ మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. విశ్వంభర సినిమా ఇతర భాషల్లో సంచలన విజయం సాధిస్తుందేమో చూడాలి. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.