భారీ బడ్జెట్ తో సినిమా.. వర్కవుట్ అవుతుందా..?

  • January 7, 2021 / 06:57 PM IST

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాలు ఉన్నాయి. కానీ ‘ఒక్కడు’ సినిమా తరువాత గుణశేఖర్ నుండి సంతృప్తినిచ్చిన సినిమాలు రాలేదు. ఎక్కువగా ఫెయిల్యూర్ సినిమాలే కనిపిస్తాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘రుద్రమదేవి’ సినిమా బాగానే ఆడింది కానీ ఆశించిన స్థాయిలో సినిమా లేదనే చెప్పాలి. ఈ సినిమా కోసం గుణశేఖర్ రూ.60 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. లేడీ ఓరియెంటెడ్ సినిమా మీద ఆ రేంజ్ లో ఖర్చు పెట్టడం మామూలు విషయం కాదు.

ఆ మొత్తాన్ని సినిమా రాబట్టగలదా లేదా అనే సందేహాలు ఉండేవి. కానీ ఓ మోస్తరుగా సినిమా ఆడి.. గుణశేఖర్ ని స్వల్ప నష్టాలతో బయటపడేసింది. ఈ సినిమా తరువాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న గుణశేఖర్.. రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ సినిమా చేయాలనుకున్నారు. మొదట్లో ఓకే చెప్పిన రానా ఇప్పుడు వెనక్కి తగ్గాడు. దీంతో ఈలోగా ‘శాకుంతలం’ అంటూమైథ‌లాజిక‌ల్ సినిమా తీయడానికి రంగం సిద్ధం చేశాడు గుణశేఖర్. ఇది ఆయన సొంత బ్యానర్లోనే తెరకెక్కుతోంది. ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ప్రీప్రొడక్షన్ వర్క్ కోసం కోట్లలో ఖర్చు పెడుతున్నారు.

సినిమా కోసం భారీ సెట్టింగ్స్ కూడా రెడీ అవుతున్నాయి. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత దశాబ్దన్నర కాలంలో గుణశేఖర్ కి ఆర్థికంగా ఏ సినిమా కలిసి రాలేదు. కానీ ఇప్పుడు ‘శాకుంతలం’ సినిమా కోసం భారీ బడ్జెట్ ని ఎలా సమకూర్చుకుంటున్నాడో అనే విషయంపై ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు. గుణశేఖర్ ని నమ్మి ఫైనాన్షియలు ఇంత డబ్బు ఇవ్వడం మామూలు విషయం కాదు. మరి ఈ సినిమాతో అయినా.. గుణశేఖర్ భారీ హిట్ ను అందుకుంటాడేమో చూడాలి!

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus