Ravi Teja: రవితేజకి నార్త్ లో కూడా హిట్టు పడేలా ఉందే!

  • October 5, 2023 / 12:37 PM IST

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్‌ నాగేశ్వరరావు’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులో రవితేజ మాస్‌ లుక్‌, డైలాగులు, ఆకట్టుకున్నాయి. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. స్టూవర్టుపురం లో అన్యాయానికి గురైన ఓ సాధారణ మనిషి బందిపోటు దొంగగా మారి ఎందుకు దొంగతనాలు చేశాడు అనే లైన్ తో ఈ సినిమా రూపొందింది. ఇలాంటి కథలు చిన్నప్పటి నుండి మనం చాలానే చూస్తూ వచ్చాము.

అయితే ఆ కథలకి స్ఫూర్తి ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవితం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇతన్ని చాలా మంది రాబిన్ హుడ్ తో పోలుస్తారు. అప్పట్లో ప్రధాన మంత్రికి కూడా వణుకు పుట్టించిన వ్యక్తి అని ఈ స్టూవర్టుపురం దొంగ గురించి చెప్పుకుంటారు. అంతేకాదు.. రన్నింగ్ ట్రైన్ తో సమానంగా పరిగెత్తి మరీ దొంగతనాలు చేయడంలో ఇతను సిద్ధహస్తుడు. అందుకే ‘టైగర్ నాగేశ్వరరావు’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులోనే కాదు హిందీలో కూడా అంచనాలు భారీగా పెరిగాయి.

ట్రైలర్ లాంచ్ ను ముంబైలో నిర్వహించడం వల్ల.. ‘టైగర్ నాగేశ్వరరావు’ హిందీ రిలీజ్ కు అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఈ సినిమాకి మంచి బిజినెస్ జరుగుతుందట. నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి నార్త్ లో మంచి సర్కిల్ ఉంది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ ‘కార్తికేయ 2 ‘ వంటి చిత్రాలతో అక్కడి జనాలను అతను బాగా అట్రాక్ట్ చేశాడు. అందుకే ‘టైగర్ నాగేశ్వరరావు’ ని హిందీలో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus