అవును కరోనా.. వల్ల ఇప్పటికే సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. దీని వల్ల నిర్మాతలకి ఇప్పటికే కోట్లలో నష్టం ఉంటుంది. షూటింగ్ నిమ్మిత్తం ఇప్పటికే కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి స్టార్ హీరోలకు అడ్వాన్స్ ఇచ్చి కర్చీఫ్ లు వేసుకుని కూర్చుంటారు. ఇలాంటి టైములో సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోతే ఆ అప్పులకి ఇంట్రెస్ట్ లు తడిసిమోపుడవుతాయి. ఇక సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోతే.. వారికి మరింత ఇబ్బంది అవుతాయి.
ఇప్పుడు థియేటర్లు కూడా మూతలు పడ్డాయి. ఈ క్రమంలో సినిమా షూటింగ్ లు మొదలై పూర్తి చేసినా .. మార్కెట్ చేసుకునేటప్పుడు మాత్రం వారికి ఇదివరకు ఉండే అడ్వాంటేజ్ ఉండక పోవచ్చు. ఓవర్సీస్ మార్కెట్ బాగా దెబ్బ తినేస్తుంది. అందులో ఏ డౌట్ లేదు. ఇక ఇక్కడ థియేటర్ లు ఓపెన్ చేసినా .. ఓ 6 నెలల వరకూ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉండక పోవచ్చు. కాబట్టి ఈ ఎఫెక్ట్ నుండీ సంపూర్ణంగా పికప్ అవ్వడానికి ఓ ఏడాది నుండీ ఏడాదిన్నర వరకూ టైం పట్టే అవకాశం ఉంటుంది.
ఈ ఎఫెక్ట్ స్టార్ హీరోల పారితోషికాల పై పడే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు వంటి హీరోలు 40 నుండీ 50 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నారు. ఇక చరణ్, తారక్ లు 30 కోట్లు తీసుకుంటున్నారు. అయితే వీరి పారితోషికాల విషయంలో నిర్మాతలు కోతలు వెయ్యడం తప్పదు అని ఇండస్ట్రీ నుండీ అందుతున్న సమాచారం. పాపం స్టార్ హీరోలకు కరోనా పెద్ద దెబ్బె వేసింది.
Most Recommended Video
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!