బాలయ్య జై సింహా మూవీ కోసం తరలిన 110 బస్సులు!

మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే భారీ యాక్షన్ సీన్స్ కి నందమూరి బాలకృష్ణ సినిమాలు కేరాఫ్ గా ఉంటాయి. అలా మాస్ ఆడియన్స్ కోసం జై సింహాగా వస్తున్నారు బాలయ్య. తమిళ దర్శకుడు కె ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఈ మూవీ అనుకున్నదానికంటే స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా క్లైమాక్స్ పార్ట్ కంప్లీట్ చేసిన డైరక్టర్ తాజాగా వైజాగ్ బీచ్ రోడ్‌లో 5 వేల జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో “మహాధర్నా” సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. ఇదే షెడ్యూల్‌లో బాలకృష్ణ, హరిప్రియలపై ఒ రోమాంటిక్ సాంగ్‌, బాలయ్యపై ఓ మాంటేజ్ సాంగ్‌ను షూట్ చేయనున్నారు.

సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ లుక్‌ను నవంబర్ 1న రిలీజ్ చేయనున్నారు. బాలకృష్ణ సరసన నయనతార, నటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాని వచ్చే ఏడాది సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 12న విడుదల చేయాలని నిర్మాత సి.కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. సంక్రాంతి హీరోగా పేరుతెచ్చుకున్న బాలకృష్ణ ఈ సారి కూడా ఆ పేరు నిలబెట్టుకుంటారని చిత్ర బృందం గట్టిగా విశ్వసిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus