ఎస్వీ కృష్ణారెడ్డి టు మెహర్ రమేష్..2023 లో ఈ పాత డైరెక్టర్లు హిట్లు కొడతారా..?

  • March 2, 2023 / 06:11 PM IST

సినీ పరిశ్రమలో అంత ఈజీగా ఏదీ సాధ్యం కాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. ఇక్కడ కొంతమందికి చాలా త్వరగా అవకాశాలు వస్తాయి. కానీ హిట్లు కొడతారు అన్న గ్యారెంటీ లేదు. మరికొంతమందికి అంత ఈజీగా అవకాశాలు రావు.. కానీ హిట్లు కొట్టి చూపించిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. చాలా ఏళ్ళ తర్వాత కొంతమంది దర్శకులకు అవకాశాలు వచ్చాయి. విచిత్రం ఏంటంటే ఆ దర్శకుల సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కాబోతున్నాయి. మరి రాక రాక వచ్చిన అవకాశాన్ని ఈ దర్శకులు సద్వినియోగపరుచుకుంటారా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంకెందుకు ఆలస్యం ఆ దర్శకులు ఎవరో.. మీరే ఓ లుక్కేయండి :

1) శ్రీవాస్ :

2018 లో వచ్చిన ‘సాక్ష్యం’ తర్వాత దర్శకుడు శ్రీవాస్ నుండి మరో సినిమా రాలేదు. 5 ఏళ్ళ తర్వాత అతని నుండి ‘రామ బాణం’ అనే సినిమా వస్తుంది. గోపీచంద్ హీరోగా నటించిన ఈ మూవీ 2023 సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాతో అయినా హిట్టు కొడతాడా లేదా అన్నది చూడాలి.

2) మెహర్ రమేష్ :

2013 లో వచ్చిన ‘షాడో’ తర్వాత దర్శకుడు మెహర్ రమేష్ నుండి మరో సినిమా రాలేదు. దాదాపు 10 ఏళ్ళ తర్వాత చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి..!

3) వి.వి.వినాయక్ :

2018 లో వచ్చిన ‘ఇంటిలిజెంట్’ తర్వాత వినాయక్ నుండి మరో సినిమా రాలేదు. ‘ఛత్రపతి’ సినిమాని హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రీమేక్ చేస్తున్నాడు. ఇది తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. సో దీంతో అయినా హిట్టు కొట్టి వినాయక్ కోలుకుంటాడేమో చూడాలి.

4) ఎస్వీ కృష్ణారెడ్డి :

‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ. 2014 లో వచ్చిన ‘యమలీల 2’ తర్వాత కృష్ణారెడ్డి నుండి వస్తున్న సినిమా ఇది. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

5) గుణశేఖర్ :

2016 లో వచ్చిన ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘శాకుంతలం’. 2023 సమ్మర్ కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.

6) వక్కంతం వంశీ :

2018 లో వచ్చిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం తర్వాత వక్కంతం వంశీ నితిన్ తో ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది ఆ చిత్రం. దీంతో అయినా అతను హిట్టు కొడతాడేమో చూడాలి.

7) అవసరాల శ్రీనివాస్ :

2016 లో వచ్చిన ‘జ్యో అచ్యుతానంద’ సినిమా తర్వాత ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దర్శకుడు అవసరాల. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.

8) వంశీ కృష్ణ :

2017 లో వచ్చిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని వంశీ కృష్ణ చేస్తున్న మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. మరి ఈ మూవీ ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.

9) నందినీ రెడ్డి :

2019 లో వచ్చిన ‘ఓ బేబీ’ తర్వాత నందినీ రెడ్డి నుండి రాబోతున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’. 2023 సమ్మర్లో రిలీజ్ కానున్న ఈ మూవీ ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.

10) తరుణ్ భాస్కర్ :

2018లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన తరుణ్ భాస్కర్.. దాదాపు 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘కీడా కోలా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

11) సముద్రఖని :

2015 లో వచ్చిన ‘జెండా పై కపిరాజు’ తర్వాత సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రూపొందుతోంది. ‘వినోదయ సీతమ్’ కి ఇది రీమేక్. ఈ ఏడాదే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.

12) తేజ :

2019 లో వచ్చిన ‘సీత’ తర్వాత 2023 లో ‘అహింస’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దర్శకుడు తేజ. ఈ ఏడాదే విడుదల కాబోతున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.

13) వి.ఐ ఆనంద్ :

2020 లో ‘డిస్కో రాజా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విఐ ఆనంద్ ఆ సినిమాతో భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఈ ఏడాది ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.

14) కృష్ణవంశీ :

2017 లో వచ్చిన ‘నక్షత్రం’ తర్వాత 2023 లో ‘రంగమార్తాండ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కృష్ణవంశీ. ఈ సినిమాతో హిట్టు కొడతాడా లేదా అన్నది చూడాలి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus