‘సాక్ష్యం’ నష్టాన్ని భరించేది వారేనా?

  • August 8, 2018 / 01:21 PM IST

ఏదైనా సినిమా పట్టాలెక్కాలంటే.. అందులో హీరో ఎవరు? టెక్నీషియన్స్ ఎవరు? ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది? అనే దాని బట్టి బడ్జెట్ డిసైడ్ అవుతుంది. కొన్ని సార్లు తప్ప మిగతా అన్నివేళలా.. ఆ బడ్జెట్ లోపలే సినిమా కంప్లీట్ అవుతుంది. అయితే ఈ తతంగం మొత్తం యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాకి వర్తించదు. యువ హీరోలకి 20 కోట్లు పెట్టాలంటే ఆలోచిస్తారు. ముప్ఫైకోట్లు వసూలు చేసే కథ అయినప్పటికీ ఆచితూచి ఖర్చు చేస్తారు. కానీ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా బడ్జెట్ మాత్రం 30 కోట్లు దాటిపోతాయి. స్టార్ హీరోయిన్, సీనియర్ టెక్నీషియన్స్, ఫారెన్ లొకేషన్స్, భారీ సెట్లు, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్.. ఇలా అంతా రేంజ్ లో ఉంటాయి. మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని చూసి ఇంత ఖర్చు చేస్తారా? అంటే కాదు.. అతని తండ్రి కనిపించని నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముంది తెలియదు గానీ “సాక్ష్యం” సినిమాకి మాత్రం 30 కోట్లు ఖర్చు అయిన మాట వాస్తవం.

శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది. నేనే ఒప్పుకోను మర్రో అని మొత్తుకున్నా భారీ రెమ్యునరేషన్ ఆశ చూపి చేయించారు. ఇప్పుడు సినిమా ఫెయిల్ కావడంతో ఆమె తలపట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ఈరోస్ ఇంటర్నేషనల్’ కైవసం చేసుకుందని ప్రచారం చేశారు. 40 కోట్లకు కొన్నట్టు ఊదరగొట్టారు. తెలుగు రాష్ట్రాల్లో సాక్ష్యం మొదటివారానికి 10 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా అసలు రావాలంటే 30 కోట్లు రావాలి. చిలసౌ, గూఢచారి సినిమాల దెబ్బకి “సాక్ష్యం” థియేటర్లు బాగా తగ్గిపోయాయి. సో కలక్షన్స్ దారుణంగా పడిపోతున్నాయి. అంటే ఆ సంస్థ ఈ చిత్రం వల్ల 30 కోట్ల నష్టపోయిందా? అంత నష్టం వచ్చినా సైలెంటుగా ఉందా? .. ఆ నష్టాన్ని వారే భరించారా?.. నిర్మాతలు భరించారా? లేక బెల్లంకొండ సురేష్ భరిస్తారా? అనేది ఇప్పుడు ఫిలిం నగర్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus