Janhvi Kapoor: జాన్వీ డ్రెస్‌ ధర మరో పేలింది.. అందగత్తె డ్రెస్‌కి అంత ధర పెట్టాలా? ఎంతో తెలుసా?

బాలీవుడ్‌, టాలీవుడ్‌.. ఇలా ఎక్కడైనా ఇప్పుడు గ్లామర్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న అందాల హీరోయిన్లలో జాన్వీ కపూర్‌ ఎప్పుడూ తొలి స్థానంలో ఉంటుంది. అటు ఇందం, ఇటు ఫిగర్‌.. ఎలా చూసినా ఆమె టాప్‌. ఈ మాటను కాదనేవారే లేరు. ఇంతటి పేరు రావడానికి కారణాల్లో ఫ్యాషన్‌ సెన్స్‌ కూడా ఒకటి. ఆమె ఎంచుకునే దుస్తులు, వాటిని క్యారీ చేసే విధానం అదిరిపోతాయి. తాజాగా ఆమె ధరించిన ఓ అవుట్‌ఫిట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Janhvi Kapoor

సోషల్‌ మీడియాలో జాన్వీ కపూర్‌ ఏదైనా ఫొటోలు షేర్‌ చేస్తే.. ఆమె అభిమానులు, ఫ్యాన్స్‌ చేసే పని ఏంటంటే.. ఆమె దుస్తులు, యాక్సెసరీస్‌ ఎక్కడ నుండి తీసుకుంది అని చూడటమే. ఆ తర్వాత వాటి ధర ఎంత అనేది కనుక్కుంటూ ఉంటారు. అలా తాజాగా ఆమె ఓ గౌన్‌తో దిగిన ఫొటోలను కూడా పోస్ట్‌ చేసింది. వాటి సంగతేంటో చూద్దాం అని ఫ్యాన్స్‌ ట్రై చేస్తే.. ఆ గౌను ధర సుమారు రూ.3 లక్షలు అని తేలింది. దీంతో అవాక్కవడం కొత్త ఫ్యాన్స్‌ వంతు కాగా, అవునా అని కూల్‌గా తీసుకోవడం పాత ఫ్యాన్స్‌ వంతు అయింది.

జాన్వీ కపూర్ కొత్త ఫోటోలను ఫ్యాషన్ స్టైలిస్ట్ మేగన్ కాన్సెసియో తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్ చేసింది. డీప్ నెక్ ప్రింటెడ్ సీక్విన్డ్ మ్యాక్సీ డ్రెస్ గౌన్ అది. దానకి ఓ స్కార్ఫ్ కూడా ఉంది. గోల్డ్ టోన్డ్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ ఎలిగెంట్ లుక్‌ని తెచ్చిపెట్టాయి. ఇక చేతిలో స్టైలిష్ బ్యాగ్ కూడా ఉంది. ఎప్పటిలానే తక్కువ మేకప్‌ వేసుకుంది. గ్లాసీ లిప్స్ అయితే టూ క్యూట్‌ ఉన్నాయి. ఆమె లుక్‌, ఖర్చు సీనియర్‌ ఫ్యాన్స్‌కి బాగానే తెలుసు మరి.

ఇక ఆమె సినిమాల సంగతి చూస్తే.. ఇటీవల ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ సినిమాతో వచ్చింది. ప్రస్తుతం రామ్‌ చరణ్‌తో ‘పెద్ది’ సినిమాలో నటిస్తోంది. త్వరలో ఓ తమిళ సినిమా షురూ చేస్తుందని సమాచారం.

బాలీవుడ్ ‘హీమ్యాన్’.. సీనియర్ స్టార్ ధర్మేంద్ర మృతి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus