భారీ ధరకు అమ్ముడు పోయిన మహేష్, మురుగదాస్ సినిమా శాటిలైట్ హక్కులు

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగి పోతున్నాయి. 100 కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందుకే ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ కూడా విడుదల కాక ముందే తెలుగు శాటిలైట్ హక్కులు అమ్ముడు పోయాయి. అనేక ఛానళ్ల వారితో పోటీపడి జీ గ్రూప్ వారు అత్యధిక రేటుకి  సొంతం చేసుకున్నారు. తెలుగు, హిందీ(డబ్బింగ్) శాటిలైట్ హక్కుల కోసం ఈ సంస్థ 26.5 కోట్లు చెల్లించింది.

ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా ఇంత ధర పలకలేదు. ఈ రికార్డును మహేష్ బాబు సాధించారు. దీనికి సంబంధించిన ఒప్పందం రెండు రోజుల క్రితం పూర్తి అయిందని చిత్ర బృందం వెల్లడించింది. సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత పది రోజులుగా హైదరాబాద్ లోని బిజీ రోడ్లపై జరుగుతోంది. ఈ ఒక్క ఛేజింగ్ సీన్ కోసం మూడు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ సన్నివేశం సినిమాలో హైలెట్ గా నిలవనుంది. ఇక్కడి షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చిత్ర యూనిట్  గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కి పయనం కానుంది. అక్కడే ప్రిన్స్,  హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, విలన్ ఎస్.జె.సూర్యలపై కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus