అగ్ర హీరో సినిమా వస్తోందంటే చాలు… శాటిలైట్ హక్కుల కోసం టీవీ ఛానళ్లు పోటీ పడుతుంటాయి. సినిమా బజ్ ప్రకారం రేటు కట్టేసి, విడుదలకు ముందే ఎగరేసుకుపోతాయి. ఇప్పుడు సరైనోడు సినిమాకు కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది.
అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకొన్న చిత్రమిది. ట్రైలర్ చూస్తే.. బోయపాటి నుంచి మరో మాస్ మసాలా సినిమా రావడం ఖాయం అనిపిస్తోంది. దానికి తోడు అల్లు అర్జున్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. దాంతో… శాటిలైట్ రైట్స్ హాట్ కేకులా అమ్ముడుపోయింది. సన్ టీవీ నెట్ వర్స్ సరైనోడు రైట్స్ సొంతం చేసుకొంది. సుమారుగా 16 కోట్ల రూపాయలకు ఈ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.