భారీ ధరకు అమ్ముడుపోయిన స్పైడర్ ఓవర్సీస్ రైట్స్
- August 2, 2017 / 08:09 AM ISTByFilmy Focus
మహేష్ బాబు సినిమాలకు ఓవర్సీస్ లో డిమాండ్ ఉంది. ఇక్కడ బాగా ఆడని చిత్రాలు సైతం అక్కడ మంచి కలక్షన్స్ రాబట్టిన సందర్భాలున్నాయి. అందుకే మహేష్ సినిమా థియేటర్ రైట్స్ కోసం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహం చూపిస్తుంటారు. ప్రస్తుతం మహేష్ బాబు స్టార్ డైరక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో ‘స్పైడర్’ సినిమా చేస్తున్నారు. దీంతో దీనిని సొంతం చేసుకోవాలని అనేక కంపెనీలు పోటీపడ్డాయి. చివరికి ఓ బడా సంస్థ 15.2 కోట్లు చెల్లించి థియేటర్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న స్పైడర్ లో ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉంది.
ఈ నెల 20 నుంచి యూరప్ లోని అందమైన లొకేషన్లో మహేష్, రకుల్ పై డ్యూయెట్ తెరకెక్కించనున్నారు. దీంతో స్పైడర్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న స్పైడర్ మూవీ సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















