NTR,Janhvi Kapoor: ఎన్టీఆర్30 విషయంలో ఫ్యాన్స్ కు షాక్ తప్పదా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్30 మూవీ షూటింగ్ కొన్ని నెలల క్రితమే ప్రారంభం కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ డిలే అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుందని ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే మేకర్స్ మాత్రం హీరోయిన్ కు సంబంధించిన ప్రకటన విషయంలో నోరు మెదపడం లేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కాదని మృణాల్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గ్లామరస్ రోల్స్ లో జాన్వీ బాగానే నటించినా అభినయ ప్రధాన పాత్రల్లో ఆమె పూర్తిస్థాయిలో మెప్పించలేరని టాక్ ఉంది. ఎన్టీఆర్ కు జోడీగా మృణాల్ బాగుంటారని కొంతమంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ మృణాల్ కాంబో సెట్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఎన్టీఆర్30 మూవీ పూజా కార్యక్రమాలు ఈ నెల 23వ తేదీన జరగనున్నాయని తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి గెస్ట్ లుగా వచ్చేది ఎవరనే ప్రశ్నకు సైతం జవాబు దొరకాల్సి ఉంది.

మెగా హీరోలు ఈ కార్యక్రమానికి గెస్ట్ గా వస్తే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. నందమూరి హీరోలకు సినిమా సినిమాకు మార్కెట్ పెరుగుతుండగా ఎన్టీఆర్30 1000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఎన్టీఆర్30లో విక్రమ్, సైఫ్ అలీ ఖాన్ కనిపిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తల్లో క్లారిటీ రావాల్సి ఉంది. తారక్30 టైటిల్ ను అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో అనే చర్చ కూడా జరుగుతోంది. దాదాపు 13 నెలల పాటు ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న తారక్ ట్రిపుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus