Prashanth Neel,Jr NTR: ఆ వార్త వల్ల తారక్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైందా?

ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోరుకున్న ఇండస్ట్రీ హిట్ ఖాతాలో చేరింది. సినిమాలో తారక్ కు స్క్రీన్ స్పేస్ తగ్గిందని కొంతమంది కామెంట్లు చేసినా ఎన్టీఆర్ నటనకు అవార్డులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాకు తారక్ ఓకే చెప్పారు. జులై నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అనిరుధ్ రవిచందర్, రత్నవేలు ఈ సినిమా కోసం పని చేయనున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ తెరకెక్కాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను పూర్తి చేసి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళతారని ఫ్యాన్స్ భావించారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ నుంచి తారక్ ఫస్ట్ లుక్ విడుదల కానుందని జరిగిన ప్రచారం సైతం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అయితే సలార్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్3 సినిమాపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.

ఈ ఏడాదే కేజీఎఫ్3 షూటింగ్ మొదలుకానుందని కేజీఎఫ్3 నిర్మాత చెప్పడంతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో మూవీ కోసం మరో రెండేళ్ల పాటు ఎదురుచూపులు తప్పవని తేలిపోయింది. ప్రశాంత్ నీల్ తారక్ కు భారీ షాక్ ఇచ్చారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ డెసిషన్ తో ఎన్టీఆర్ దర్శకుల జాబితా మారే ఛాన్స్ అయితే ఉంది.

తెలుగులో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్న డైరెక్టర్లు చాలా తక్కువమంది ఉన్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎన్టీఆర్ నాలుగేళ్ల పాటు పరిమితం కావడం చాలామంది అభిమానులకు నచ్చలేదు. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో ఏ విధంగా వ్యవహరించనున్నారో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు తారక్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus