హీరోల తమ్ముళ్లు సక్సెస్ కాకపోవడానికి రీజన్లు ఇవేనా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ ఇతర భాషల్లో కూడా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ఇతర భాషల్లో అల్లు అర్జున్ మార్కెట్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. బన్నీ నటిస్తున్న పుష్ప2 సినిమా కూడా ఊహించని రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే బన్నీ సోదరుడు శిరీష్ కు మాత్రం భారీ సక్సెస్ దక్కడం లేదు. ఊర్వశివో రాక్షసివో సినిమా టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సినిమాకు కూడా మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ రావడం గమనార్హం. అయితే ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గాయి. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతుండగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితులు లేవు. అల్లు అర్జున్ స్టార్ హీరోగా వెలుగు వెలుగుతుండగా అల్లు శిరీష్ మాత్రం వరుస సినిమాలతో నిరాశపరుస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు కాగా

విజయ్ దేవరకొండ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే విజయ్ దేవరకొండ సక్సెస్ అయిన స్థాయిలో ఆనంద్ దేవరకొండ సక్సెస్ కాలేదు. ఆనంద దేవరకొండ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. విజయ్ దేవరకొండ తన వంతు సపోర్ట్ చేస్తున్నా ఆనంద్ దేవరకొండ మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన సాయి ధరమ్ తేజ్ కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. సాయితేజ్ తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాలలో ఉప్పెన మినహా మరే సినిమా సక్సెస్ కాలేదు. వైష్ణవ్ తేజ్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్టార్ హీరోల తమ్ముళ్లు రాబోయే రోజుల్లో అయినా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus