Bigg Boss 7 Telugu: దీపావళి ఎపిసోడ్ లో క్రికెట్ డ్రెస్ తో ఆది.. శోభాకి వేసిన కౌంటర్ కి మైండ్ పోయింది..!

బిగ్ బాస్ హౌస్ లో దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో గెస్ట్ గా వచ్ిచన హైపర్ ఆది రెచ్చిపోయాడు. ప్రతి సీజన్ లో హైపర్ ఆది ఏదో ఒక గెటప్ లో వచ్చి దానికి సంబంధించిన స్క్రిప్ట్ తో హౌస్ మేట్స్ కి పంచ్ లు వేస్తుంటాడు. అంతేకాదు, ఆది వేసిన పంచ్ లని బట్టీ కూడా బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారో హౌస్ మేట్స్ కి అర్దమవుతుంది. అంతేకాదు, ఎపిసోడ్స్ లో ఏది హైలెట్ అయ్యింది. ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా మాట్లాడటంలో ఆది కి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఇక ఈసారి దీపావళి ప్రత్యేకమైన ఎపిసోడ్ లో హైపర్ ఆది క్రికెటర్ వేషంలో వచ్చాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ ఉంది కాబట్టి హైపర్ ఆది ఇండియన్ జెర్సీ వేసుకుని ఒక బ్యాట్ పట్టుకుని నాగార్జునతో స్టేజ్ ని షేర్ చేసుకున్నాడు. వస్తూనే ఆడియన్స్ పలకిరించాడు. అలాగే హౌస్ మేట్స్ ని తన పంచ్ లతో రోస్ట్ చేశాడు.

బిగ్ బాస్ హౌస్ లో సూపర్ బౌలర్ అంటే తేజ అని సిల్లీ బాల్స్ వేస్తూ ఆరుగురిని అవుట్ చేశాడని చెప్పాడు. అదేవిధంగా ఇంకో సిల్లీ బాల్ వేసి శివాజీ ఏకంగా తేజ విక్కెట్ తీశాడని శివాజీ పై పంచ్ వేశాడు. అలాగే, మన్మధుడు సినిమాలో లేడీస్ అంటే నాగ్ సర్ కి పడదు కాబట్టి ఈసీజన్ లో కూడా అలాగే లేడీస్ ఎలిమినేట్ అయ్యారంటూ షో పైన సెటైర్స్ వేశాడు. పల్లవి ప్రశాంత్ కి అయితే నువ్వు మొక్కపైన కాన్సన్ ట్రేషన్ చేయకుండా రతిక అక్క పైన కాన్సన్ ట్రేషన్ చేస్తుంటే.. అన్నా అన్నా అనే నువ్వు.. అన్యన్య.. అని పిచ్చివాడిలా తిరుగుతావని భయమేసిందని చెప్పాడు. అలాగే అమర్ ని చూడగానే నువ్వు నీకోసం పుట్టలేదురా.. శోభాని కెప్టెన్ ని చేయడానికి పుట్టావ్ రా.. తిప్పరా మీసం అంటూ డైలాగ్ వేసాడు. అలాగే అర్జున్ ని చూసి బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ఇవ్వాలా అని భయపడుతున్నాడని చెప్పాడు. ఇక యావర్ కి అయితే పంచ్ లు పగిలిపోయాయ్.

ఈయన తెలుగు చూసి అమ్రేష్ పురీ మళ్లీ పుట్టాడా అనిపించిందని చెప్పాడు. అలాగే, పెళ్లిని పల్లీ చేశాడు. ఎండని అండ చేశాడు అంటూ సెటైర్ వేశాడు. ఇక శోభకి అయితే కౌంటర్ కి మైండ్ బ్లాక్ అయ్యింది. తేజ ఇప్పటికీ నిద్రలో నేనేం చేయలేదు శోభా, నా తప్పేం లేదు శోభా, నాకు వద్దు ట్యాటూ, నాకు వేయండి ఓటు అంటూ కలవరిస్తున్నాడని అనేసరికి హౌస్ మేట్స్ అందరూ పగలబడి నవ్వేశారు. లాగే స్టేజ్ పైన నాగార్జున అయితే చాలాసేపు అలా నవ్వుతునే ఉండిపోయాడు. హైపర్ ఆదితో పాటుగా హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ , సెలబ్రిటీలు షోకి వచ్చి సందడి చేశారు.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus