Hyper Aadi: ఆ రూమర్ గురించి క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది.. ఏం చెప్పారంటే?

  • February 15, 2024 / 08:52 PM IST

బుల్లితెర స్టార్ కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు కాగా హైపర్ ఆదికి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోంది. అయితే హైపర్ ఆది గురించి ఎన్నో రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. ఒంగోలులో ఒక అమ్మాయిని హైపర్ ఆది ఏడిపించి దెబ్బలు తిన్నాడని ఒక న్యూస్ తెగ వైరల్ అయింది. అయితే హైపర్ ఆది ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆ కామెంట్ల గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తాను అమ్మాయిలకు దూరంగా ఉంటానని హైపర్ ఆది అన్నారు.

అమ్మాయిలతో మాట్లాడటానికి కూడా నేను ఇష్టపడనని హైపర్ ఆది చెప్పుకొచ్చారు. స్కిట్లలో భాగంగా మాత్రమే అమ్మాయిలతో మాట్లాడతానని ఆయన కామెంట్లు చేశారు. స్కిట్స్ అయిపోయిన తర్వాత అమ్మాయిలతో అస్సలు మాట్లాడనని హైపర్ ఆది వెల్లడించడం గమనార్హం. నేను అమ్మాయిని గెలికానని జనాలు కొట్టాలనేది ఫేక్ అని హైపర్ ఆది అభిప్రాయపడ్డారు. ప్రకాశం జిల్లాలో పుట్టిన హైపర్ ఆది తన టాలెంట్ తో అంతకంతకూ ఎదిగారు.

హైపర్ ఆదికి సినిమాలలో కూడా ఊహించని స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. అదే సమయంలో హైపర్ ఆది బిగ్ బాస్ షో ఎంట్రీ గురించి కూడా పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చేశారు. ఇతర ఛానల్స్ లో పూర్తిస్థాయి షోలు చేయలేమని హైపర్ ఆది పేర్కొన్నారు. అగ్రిమెంట్లను బ్రేక్ చేసి బిగ్ బాస్ షోకు వెళ్లడం సులువు కాదని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు.

హైపర్ ఆది (Hyper Aadi) బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే లేవని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైపర్ ఆదిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. హైపర్ ఆది కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హైపర్ ఆది జనసేన తరపున ప్రచారం కూడా చేయనున్నారని తెలుస్తోంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus